రోజురోజుకి కరోనా కేసులు పెరుగుతుండటం విశాఖ జిల్లా అనకాపల్లిలో వ్యాపారులు పాక్షిక లాక్డౌన్ పాటించారు. ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు వ్యాపార లావాదేవీలు నిర్వహించేలా చర్యలు చేపట్టారు. పాక్షిక లాక్డౌన్ పాటిస్తామని వ్యాపారులు ఆర్డీఓని కలిసి విన్నవించారు. కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా వ్యాపారులు స్వయంగా ముందుకొచ్చి పాక్షిక లాక్డౌన్ నిర్వహిస్తామని చెప్పి అమలు చేయడం విశేషం. దుకాణాలు మూసేయడంతో ప్రధాన రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి.
అనకాపల్లిలో వ్యాపారుల స్వచ్ఛంద లాక్డౌన్.. నిర్మానుష్యంగా రోడ్లు - Anakapalle at visakhapatnam district news update
విశాఖ జిల్లా అనకాపల్లిలో కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా వ్యాపారులు పాక్షికంగా లాక్డౌన్ పాటించారు.