ఉపాధి పనులకు కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చిన కారణంగా.. విజయనగరం జిల్లాలో వేతనదారుల సంఖ్య గణనీయంగా పెరిగింది. లాక్ డౌన్ కు ముందు జాతీయ ఉపాధి హామీ పనుల నిర్వహణలో రాష్ట్రంలో జిల్లా 12వ స్థానంలో నిలిచింది. ఈ నెల 20 నుంచి ఉపాధి పనులకు కేంద్రం లాక్ డౌన్ ఆంక్షల నుంచి మినహాయింపు ఇచ్చిన కారణంగా.. విజయనగరం జిల్లా రాష్ట్రంలో రెండో స్థానానికి చేరుకుంది.
కరోనా ప్రభావంతో గత 20 రోజులుగా వేతనదారులు పనులకు దూరమయ్యారు. లాక్ డౌన్ నిబంధనల నుంచి వెసులుబాటు కల్పించిన కారణంగా.. ఉపాధి లేక ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న కూలీలు పెద్దఎత్తున పనులు చేసేందుకు ముందుకొస్తున్నారు. సామాజిక దూరం పాటిస్తూ పనులను చేయిస్తున్నామని డ్వామా పీడీ నాగేెశ్వరరావు స్పష్టం చేశారు.