ETV Bharat / state

విశాఖ ఉక్కు పరిశ్రమ... కొవిడ్ రోగుల పాలిట ప్రాణదాత

author img

By

Published : Apr 20, 2021, 4:36 AM IST

Updated : Apr 20, 2021, 6:39 AM IST

కొవిడ్‌ రోగులకు చికిత్సలో మందులతో పాటు అత్యవసరంగా మారింది ఆక్సిజన్‌..! రోగులు శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నా, రక్తంలో ఆక్సిజన్‌ స్థాయిలు తగ్గిపోతున్నా... తక్షణం వారికి ప్రాణవాయువు అందించాల్సి వస్తోంది. ఆక్సిజన్‌ కోసం ఇప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రధానంగా ఉక్కు కర్మాగారాలపై ఆధారపడుతున్నాయి. ప్రస్తుతం మన రాష్ట్రంలోని కొవిడ్‌ ఆస్పత్రులకు అవసరమైన ప్రాణ వాయువులో సుమారు మూడో వంతు విశాఖ ఉక్కు కర్మాగారమే సరఫరా చేస్తోంది.

vizag steel plant
విశాఖ ఉక్కు పరిశ్రమ
విశాఖ ఉక్కు పరిశ్రమ... కొవిడ్ రోగుల పాలిట ప్రాణదాత

గాలిలో 20.6% ఆక్సిజన్‌, 78.03% నైట్రోజన్‌, 0.93% శాతం ఆర్గాన్‌ గ్యాస్‌లతో పాటు ఇతర మూలకాలూ ఉంటాయి. ఉక్కు తయారీలో ప్రధానంగా ఆక్సిజన్‌, నైట్రోజన్‌, ఆర్గాన్‌ వాయువుల అవసరం చాలా ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇవి లేకుండా ఉక్కుని ఉత్పత్తి చేయలేం. అందుకే ఉక్కు కర్మాగారాలన్నీ... ఈ గ్యాస్‌లను ఉత్పత్తి చేస్లే ప్లాంట్‌లు ఏర్పాటు చేసుకుంటాయి. క్రయోజనిక్‌ ఎయిర్‌ సప్రెషన్‌ విధానంలో గాలి నుంచి ఈ వాయువుల్ని వేటికవి వేరు చేస్తారు. మైనస్‌ 173 డిగ్రీల సెల్సియస్‌ కంటే తక్కువ ఉష్ణోగ్రతల్లో మాత్రమే వీటిని వేరు చేయడం సాధ్యమవుతుంది. మైనస్‌ 183 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత వద్ద ఆక్సిజన్‌ వేరవుతుంది. అది గ్యాస్‌ రూపంలో ఉంటుంది. దాన్ని ద్రవరూపంలోకి మార్చి మరింత వడకడితే 99.9 శాతం స్వచ్ఛమైన ఆక్సిజన్‌ లభిస్తుంది. ఒక గంటకు ఒక లక్ష సాధారణ ఘనపు మీటర్ల గాలిని ప్రాసెస్‌ చేస్తే... 13,500 నుంచి గరిష్ఠంగా 18,500 సాధారణ ఘనపు మీటర్ల ద్రవ రూప ఆక్సిజన్‌ ఉత్పత్తవుతుంది.

విశాఖ ఉక్కులో ఐదు యూనిట్‌లు..!

విశాఖ ఉక్కు కర్మాగారంలో ఐదు ఆక్సిజన్‌ తయారీ యూనిట్‌లు ఉన్నాయి. వాటిలో 24 గంటలూ ఆక్సిజన్‌ ఉత్పత్తి జరుగుతుంది. ఈ మొత్తం ఐదు యూనిట్ల గరిష్ఠ ఆక్సిజన్‌ ఉత్పత్తి సామర్థ్యం 2,950 టన్నులు. దీనిలో 2,700 టన్నులు వాయురూప, 250 టన్నులు ద్రవరూప ఆక్సిజన్‌. ప్రస్తుతం ఆ ఐదు ప్లాంట్‌లలో కలిపి రోజుకి గరిష్ఠంగా 2,800 టన్నుల వరకు ఆక్సిజన్‌ ఉత్పత్తి చేయగలుగుతున్నారు. దానిలో 100-150 టన్నుల వరకు ద్రవరూప ఆక్సిజన్‌ ఉత్పత్తి అవుతున్నట్లు సమాచారం. వాయురూపంలోని ఆక్సిజన్‌ పూర్తిగా ప్లాంట్‌ అవసరాలకే సరిపోతుంది. ద్రవరూప ఆక్సిజన్‌లో కూడా కొంత భాగాన్ని ప్లాంట్‌ అత్యవసర అవసరాల కోసం నిల్వ చేసుకుంటున్నారు. ఇది వరకు కొవిడ్‌ ఆస్పత్రులు, ఇతర అవసరాల కోసం ఇక్కడి నుంచి రోజుకి 50-60 టన్నుల ద్రవరూప ఆక్సిజన్‌ సరఫరా చేసేవారు.

* కొవిడ్‌ రోగులకు చికిత్స నిమిత్తం విశాఖ ఉక్కు రోజూ 100 టన్నుల ద్రవరూప ఆక్సిజన్‌ సరఫరా చేయాలని కేంద్ర ప్రభుత్వం తాజాగా లక్ష్యం నిర్దేశించడంతో ఆ మేరకు సరఫరాలు పెంచినట్లు విశాఖ ఉక్కు వర్గాలు వెల్లడించాయి. అవసరాన్నిబట్టి ఒక్కో రోజు 120 టన్నుల ఆక్సిజన్‌ సరఫరా చేసిన సందర్భాలూ ఉన్నాయని తెలిపాయి.

ఆంధ్రప్రదేశ్‌కి 360 టన్నుల కేటాయింపు

రాష్ట్రంలో విశాఖ ఉక్కుతో పాటు శ్రీకాకుళంలోని లిక్వినాక్స్‌ సంస్థ (60 టన్నులు), విశాఖలోని ఎలెన్‌బరీ (40 టన్నులు) సంస్థలు రాష్ట్ర ప్రభుత్వానికి ఆక్సిజన్‌ సరఫరా చేస్తున్నాయి. ఇంకా కర్ణాటక, తమిళనాడు, హైదరాబాద్‌లోని కొన్ని ఉక్కు, ఇతర సంస్థల నుంచి ఆక్సిజన్‌ తెప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసుకుంది. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కి రోజుకు 360 టన్నుల ఆక్సిజన్‌ను కేటాయించింది. వివిధ సంస్థల ద్వారా కేటాయింపులు ఇలా ఉన్నాయి..!

విశాఖ నుంచి మహారాష్ట్రకు ఆక్సిజన్‌!

కొవిడ్‌ అవసరాల్లో భాగంగా విశాఖ స్టీల్‌ప్లాంట్‌ నుంచి 150 టన్నుల ఆక్సిజన్‌ను మహారాష్ట్రకు పంపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆక్సిజన్‌ ట్యాంకర్లను తరలించే ప్రత్యేక రవాణా రైలు మంగళవారం వచ్చే అవకాశాలున్నాయని వాల్తేరు డివిజన్‌ అధికారులు చెబుతున్నారు. మహారాష్ట్రలోని కలంబోలీ నుంచి వచ్చే ఈ రైలు మంగళవారం రాత్రికి స్టీల్‌ప్లాంట్‌కు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. ఒక్కోటి 15 టన్నుల బరువున్న 10 ట్యాంకర్లతో తిరిగి మహారాష్ట్ర వెళ్తుందని వారు చెబుతున్నారు. ఈ రైలు ఎక్కడా ఆగకుండా మార్గాన్ని గ్రీన్‌ఛానల్‌గా మారుస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.

ఉక్కు తయారీకి అదే ప్రాణాధారం..!

విశాఖ ఉక్కు పరిశ్రమలో ఆక్సీజన్ ఉత్పత్తి

ఇనుప ఖనిజం (ఐరన్‌ఓర్‌)లో ఫెర్రస్‌ ఆక్సైడ్‌, కార్బన్‌, సిలికాన్‌ వంటి మూలకాలు ఉంటాయి. కార్బన్‌ వల్ల ఫెర్రస్‌ ఆక్సైడ్‌కి అయస్కాంతతత్వం ఉంటుంది. ఇనుప ఖనిజాన్ని కరిగించి, దానిలోంచి కార్బన్‌, సిలికాన్‌, సల్ఫర్‌ వంటి మూలకాలను తొలగించి... స్వచ్ఛమైన ఉక్కుని ఉత్పత్తి చేస్తారు. ఈ ప్రక్రియలో ఆక్సిజన్‌ చాలా అవసరం. ఇనుప ఖనిజాన్ని మొదట బ్లాస్ట్‌ఫర్నేస్‌లోకి పంపించి కరిగిస్తారు. దీనికి 1200 డిగ్రీల సెల్సియస్‌ కంటే అధిక ఉష్ణోగ్రతలు అవసరం. వేడిగాలిని వేగంగా పంపించడం ద్వారా బ్లాస్ట్‌ ఫర్నేస్‌ని మండిస్తారు. అంత అధిక ఉష్ణోగ్రత జనించేందుకు గాలిలో సహజంగా ఉండే 20.6 శాతం ఆక్సిజన్‌ సరిపోదు. అవసరాన్ని బట్టి దాన్ని పెంచేందుకు వేడిగాలికి... శుద్ధమైన ఆక్సిజన్‌ని జత చేస్తారు. అక్కడ ద్రవరూపంలోకి మారిన ఉక్కుని స్టీల్‌మెల్ట్‌షాప్‌ (ఎస్‌ఎంఎస్‌)లోకి పంపిస్తారు. అక్కడ అత్యంత పీడనంతో ఆక్సిజన్‌ను పంపించడం ద్వారా ఉక్కులోని కార్బన్‌ను వేరు చేస్తారు. అప్పుడు శుద్ధమైన ఉక్కు తయారవుతుంది. స్పెషల్‌గ్రేడ్‌ స్టీల్‌ ఉత్పత్తులు తయారు చేయాలంటే.. ఉక్కులోని సల్ఫర్‌ను తొలగించాలి. దీనికి ఆర్గాన్‌ గ్యాస్‌ ఉపయోగిస్తారు.

ఇదీ చదవండి:

'రెమిడె​సివిర్​ను బ్లాక్​లో అమ్మితే కఠిన చర్యలే'

Last Updated : Apr 20, 2021, 6:39 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.