విశాఖ గోపాలపట్నం అగనంపూడిలో క్రీడాప్రాంగణం నిర్మాణానికి తెదేపా హయాంలో కేటాయించిన స్థలాన్ని రద్దుచేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరికాదని పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు అన్నారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి జగన్‌కు లేఖ రాశారు. ప్రభుత్వం నిర్ణయంపై ఓ క్రీడాకారుడిగా ఆవేదన వ్యక్తం చేస్తున్నానన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో అన్ని క్రీడాపోటీలకు ఉపయోగపడేలా 150 ఎకరాల్లో ప్రాంగణం నిర్మించాలనే లక్ష్యంతో అప్పటి ప్రభుత్వం భూమి కేటాయించిందన్నారు. ఇప్పటికే 80 ఎకరాలు సేకరించి శాప్‌కు అప్పగించారని.. మరో 70 ఎకరాలు కేటాయించి ప్రాజెక్టును పూర్తిచేయాలని కోరారు. ప్రాజెక్ట్ రద్దు నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఇవీ చదవండి..