MAYOR: విశాఖ నగరంలో పేరుకుపోతున్న కాలుష్యాన్ని నివారించడంతో పాటు.. ప్రజా రవాణాపై ప్రజలకు అవగాహన కల్పించే ఉద్దేశంతో నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేశారు. ఆరిలోవ బస్‌స్టాప్ నుంచి జీవీఎంసీ కార్యాలయం వరకు ఆర్టీసీ బస్సులో టిక్కెట్ తీసుకుని ప్రయాణం చేశారు. ఆమెతోపాటు సిబ్బంది కూడా బస్సులో వచ్చారు. కాలుష్య నివారణలో తన వంతు భాగస్వామ్యంగా ప్రతి సోమవారం బస్సులో ప్రయాణం చేయనున్నట్లు ఆమె స్పష్టం చేశారు. నగరవాసులు కూడా కాలుష్య నివారణకు తమ వంతు సహకారం అందించి.. ప్రజారవాణాను ఉపయోగించుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
ఇవీ చదవండి: