తెదేపా హయాంలో పేదల కోసం నిర్మించిన గృహాలను లబ్ధిదారులకు అందజేయాలని ఆ పార్టీ యువనేత చింతకాయల విజయ్ డిమాండ్ చేశారు. విశాఖ జిల్లా నర్సీపట్నం ఆర్డీఓ కార్యాలయం వద్ద గృహ లబ్ధిదారులతో ఆందోళన చేపట్టారు. సీఎం జగన్ ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరారు. ఇప్పటికే 80 నుంచి 90 శాతం పూర్తయిన ఇళ్లకు అడ్డంకులు సృష్టించడం తగదన్నారు. ఆ ఇళ్లను పూర్తిచేసి లబ్ధిదారులకు అందజేయాలని విజ్ఞప్తి చేశారు.
ఇవీ చదవండి... : రైతుభరోసా కేంద్రాలతో వ్యవసాయ ముఖచిత్రం మారిపోతుంది: కన్నబాబు