మద్యం, మాంసం దుకాణాలను తొలగించాలని విశాఖలోని సింహాచలం దేవస్థాన ఈవోకు విశ్వహిందూ పరిషత్ కార్యవర్గం వినతి పత్రం అందజేసింది. స్వామివారి తిరువీధి నిర్వహించే ప్రాంతంలో.. కొంత కాలం క్రితం ఈ దుకాణాలు వెలిశాయని సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. అప్పన్న తొలిమెట్టుకు కూతవేటు దూరంలో మద్యం దుకాణాలు ఉన్నా.. వాటిపై చర్యలు తీసుకోలేదని అభ్యంతరం చెప్పారు.
కొండ చుట్టూ విస్తరించి ఉన్న చర్చిలు, మసీదులు తరహా అన్య మతస్తుల నిర్మాణాలనూ తొలగించాలని వీహెచ్పీ సభ్యులు కోరారు. హిందూ మతాన్ని కాపాడాలని విన్నవించారు.
ఇదీ చదవండి: