ETV Bharat / state

Rowdysheeter:నన్ను ఎదిరిస్తే ఎవరికైనా ఇదేగతి.. రౌడీషీటర్ బహిరంగ హెచ్చరిక

Gowri Shankar: ‘నన్ను ఎదిరిస్తే ఎవరికైనా ఇదే గతి పడుతుంది’ ... ‘తన వద్ద తీసుకున్న రూ.500 తిరిగి ఇవ్వమని అడిగినందుకు అనుచరులతో కలిసి వచ్చి అప్పన్న(28)ను నరికి చంపిన తర్వాత శుక్రవారం అర్ధరాత్రి రౌడీషీటర్‌ గౌరీశంకర్‌ కత్తి తిప్పుతూ సంఘటన స్థలంలో చేసిన హెచ్చరిక ఇది’ అని పలువురు పేర్కొంటున్నారు.

Rowdysheete
Rowdysheete
author img

By

Published : Jul 24, 2022, 12:43 PM IST

Rowdysheeter: ‘నన్ను ఎదిరిస్తే ఎవరికైనా ఇదే గతి పడుతుంది’ ... ‘తన వద్ద తీసుకున్న రూ.500 తిరిగి ఇవ్వమని అడిగినందుకు అనుచరులతో కలిసి వచ్చి అప్పన్న(28)ను నరికి చంపిన తర్వాత శుక్రవారం అర్ధరాత్రి రౌడీషీటర్‌ గౌరీశంకర్‌ కత్తి తిప్పుతూ సంఘటన స్థలంలో చేసిన హెచ్చరిక ఇది’ అని పలువురు పేర్కొంటున్నారు.
* ఈ ప్రాంతంలో తన ఆధిపత్యం ప్రదర్శించడానికి ఇలా చేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నా.. ప్రశాంతతకు నిలయమైన పెదవాల్తేరులో ఈ తరహా సంఘటన అక్కడి వారిని ఉలిక్కిపడేలా చేసింది. కొన్ని రోజులుగా ఇక్కడ మద్యం, మత్తు పదార్థాల విక్రయాలు పెరగడం.. నిందితులు కూడా హత్య సమయంలో మద్యం మత్తులోనే ఉండటంతో ఈ ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

‘రాజీ’కే మొగ్గుచూపుతారు:

నగరంలో పెదవాల్తేరు ఓ భాగమైన ఇప్పటికీ అక్కడ వివాదాలకు గ్రామ పెద్దలు రాజీ మార్గాన్నే అనుసరిస్తారు. పెద్దలంతా కూర్చొని సమస్యలు పరిష్కరిస్తారు. ఈ ప్రాంతం నుంచి పోలీసు స్టేషన్‌కు వచ్చే కేసులు కూడా తక్కువనేని స్వయంగా శనివారం పోలీసులే పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి జరిగిన సంఘటన చూస్తే ఇక్కడి పరిస్థితులు అదుపు తప్పుతున్నాయని అనిపిస్తోందని పలువురంటున్నారు. భారీగా సాగే మద్యం విక్రయాలు..మత్తుపదార్థాలు కూడా ఇందుకు కారణమని భావిస్తున్నారు.

ధర్నాకు ఉపక్రమించినా

అప్పన్నను హత్య చేసిన నిందితులకు బెయిల్‌ దొరకని సెక్షన్లలో కేసులు పెట్టాలని.. లేదంటే నిందితులను మాకు అప్పగించాలంటూ పెదవాల్తేరు వాసులు వందల మంది ఎంవీపీ స్టేషన్‌ ముందు ఆందోళన చేపట్టారు. ఈ సంఘటన ఉద్రిక్తతకు దారితీసింది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు ఈ ఆందోళన కొనసాగింది. అన్ని పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు బాధితులకు మద్దతుగా నిలిచారు. మృతదేహం అప్పగించాక కూడా కలెక్టరేట్‌ వద్ద ధర్నాకు యత్నించినా పోలీసులు అడ్డుకున్నారు.

* ఈ సంఘటనపై మృతుడు అప్పన్న అత్త కొండమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితులను అదుపులోకితీసుకున్నారు. వీరికి సహాయం చేసిన గౌరీశంకర్‌ సోదరుడు సాయి ప్రస్తుతం పరారీలో ఉన్నాడన్నారు. తన సోదరుడు సాయితో అప్పన్న గొడవపడ్డాడని.. అతన్ని చంపేయాలని సాయి చెప్పడంతో ఈ హత్య చేశానని గౌరీశంకర్‌ పోలీసులకు తెలిపినట్లు ఏసీపీ తెలిపారు.
* అప్పన్నకు ఇద్దరు కుమారులు. రౌడీషీటర్‌ దాడి చేసిన సంఘటనను ప్రత్యక్షంగా చూసిన తర్వాత అప్పన్న భార్య అపస్మారక స్థితిలోకి వెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.