ETV Bharat / state

కొవిడ్ వ్యాప్తిని నియంత్రించిన అర్బన్ ప్రాంతంగా విశాఖకు గుర్తింపు - విశాఖ కొవిడ్ కంట్రోల్​పై బీఎంజే సర్వే వార్తలు

తొలినాళ్లలో కొవిడ్‌ వ్యాప్తిని సమర్థవంతంగా నియంత్రించిన అర్బన్‌ ప్రాంతంగా విశాఖకు గుర్తింపు లభించింది. జాతీయ స్థాయిలో అంతర్జాతీయ గుర్తింపు పొందిన బీఎంజె(బ్రిటీష్‌ మెడికల్‌ జర్నల్‌) గ్లోబుల్‌ హెల్త్‌ సంస్థ ప్రారంభదశలో పరిమిత వనరులతో కొవిడ్‌ నియంత్రణ అనే అంశంపై అధ్యయనం చేసింది. కొవిడ్‌ వ్యాప్తి కట్టడిలో విజయం సాధించిన ప్రాంతాలను గుర్తించి, దానికి దారి తీసిన కారణాలను విశ్లేషించారు.

కొవిడ్ వ్యాప్తిని నియంత్రించిన అర్బన్ ప్రాంతంగా విశాఖకు గుర్తింపు

author img

By

Published : Nov 20, 2020, 8:39 AM IST

పట్టణ ప్రాంత విభాగంలో విభిన్న ప్రభుత్వశాఖలను సమన్వయపరిచి సమష్టిగా కృషి చేయడం వల్ల విశాఖలో కరోనా వ్యాప్తి కట్టడి సాధ్యమైందని, ఇది దేశానికి రోల్‌మోడల్‌ (ఆదర్శంగా) నిలిచిందని అధ్యయన నివేదికలో బీఎంజె వెల్లడించింది. అంతర్జాతీయ స్థాయిలో ఈనెల 13న బీఎంజె ప్రచురించిన తాజా జర్నల్‌లో ఈ అంశాలను తెలియజేసిందని జిల్లా కలెక్టర్‌ వి.వినయ్‌చంద్‌ తెలిపారు.

గ్రిడ్‌ కొవిడ్‌-19 గ్రూపు ఒక అధ్యయనాన్ని చేపట్టింది. గ్రిడ్‌ గ్రూపులో దేశంలో 40 ప్రముఖ సంస్థలకు చెందిన 55 మంది శాస్త్రవేత్తలు సభ్యులుగా ఉన్నారు. వీరంతా దేశవ్యాప్తంగా 21 రాష్ట్రాలు, మూడు కేంద్ర పాలిత ప్రాంతాలను కేంద్రంగా చేసుకొని అధ్యయనం కొనసాగించారు. ప్రముఖుల ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్న అధ్యయన నివేదిక అంతర్జాతీయ స్థాయిలో ప్రచురించడం వల్ల ప్రాముఖ్యతను సంతరించుకుంది. దేశవ్యాప్తంగా ప్రారంభదశలో కొవిడ్‌ వ్యాప్తి నియంత్రణకు తీసుకున్న చర్యలను సునిశితంగా పరిశీలించారు. దేశవ్యాప్తంగా ఒక్కో కేటగిరీలో ఒక్కొక్కటి చొప్పున ఏడు ప్రాంతాలు నివారణ చర్యల్లో ఆదర్శంగా నిలిచాయని విశాఖ జిల్లా కలెక్టర్‌ వినయ్ చంద్ చెప్పారు.

అర్బన్‌(పట్టణ/నగర) ప్రాంతాల విభాగంలో విశాఖలో అమలు చేసిన విధానాలు ఆదర్శమైనవిగా గుర్తింపు పొందాయని కలెక్టర్ వినయ్ చంద్​ తెలిపారు. దేశంలోనే జనవరి 17న తొలి కేసు నమోదైందని, అప్పటి నుంచి ఏప్రిల్‌ వరకు తీసుకున్న నియంత్రణ చర్యల ఆధారంగా ఈ అధ్యయనం సాగింది. విశాఖలో మార్చి 18న తొలి కొవిడ్‌ కేసు నమోదైంది. కేసు నిర్ధారణ అయిన మరుసటి రోజు నుంచే జిల్లా యంత్రాంగం అప్రమత్తమై నివారణ, కంటైన్‌మెంట్‌ చర్యలను యుద్ధప్రాతిపదికన చేపట్టింది. పలు ప్రభుత్వ శాఖలను సమన్వయపర్చి ఒకే తాటిపైకి తీసుకొచ్చి కట్టడి చర్యలను చేపట్టారు. ఫలితంగా మార్చి, ఏప్రిల్‌ నెలల్లో వైరస్‌ వ్యాప్తి తక్కువగా సాగింది. ఆ రెండు నెలల్లో జిల్లాలో కేవలం 24 కేసులు మాత్రమే నమోదయ్యాయి.

నగరంలోని అల్లిపురం, రైల్వే న్యూ కాలనీ, ముస్లిం తాటిచెట్లపాలెం, పద్మనాభం ప్రాంతాల్లో మాత్రమే కేసులు వచ్చాయి. కంటైన్‌మెంట్‌ జోన్లుగా గుర్తించిన ప్రాంతాల్లో కట్టడిని పటిష్ఠంగా అమలు చేయడం, ట్రేసింగ్, టెస్టింగ్‌లను పటిష్ఠంగా అమలు చేయడం ద్వారా వ్యాప్తిని నియంత్రించే వ్యూహం అమలైంది. ఇతర జిల్లాల్లో భారీగా కేసులు వచ్చినప్పటికీ విశాఖ నగరంలో చాలా తక్కువ సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. ఏఎంసీ వైద్యులు, పీజీలు, పరిపాలన యంత్రాంగం సమష్టి కృషి ఫలితంగా జాతీయ స్థాయిలో కొవిడ్‌ వ్యాప్తి నివారణలో విశాఖ ప్రత్యేకంగా నిలిచింది. ముఖ్యమంత్రి జగన్, ఆరోగ్యమంత్రి, ఉన్నతాధికారుల ప్రోత్సహం కారణంగా ఇది సాధ్యపడిందని కలెక్టర్ వినయ్ చంద్‌ వివరించారు.

ఇదీ చదవండి: 14 మంది బలి- మృతుల్లో ఆరుగురు చిన్నారులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.