ETV Bharat / state

విశాఖ నౌకాశ్రయానికి మరో ఘనత - vishaka port

దేశంలోనే అత్యంత రద్దీ పోర్టుల్లో ఒకటిగా కీర్తిగడించిన విశాఖ నౌకాశ్రయం...మరో ముందడుగు వేయనుంది. అతి భారీ ఓడల విశాఖ పోర్టుకు తీసుకొచ్చేందుకు సింగపూర్‌లోని సిమ్యులేషన్ అధ్యయనం ఎంతో ఉపయోగకరంగా మారనుంది. ఇకపై అతిభారీ నౌకలు కూడా ఇన్నర్‌ హార్బర్‌లోకి వచ్చేందుకు మార్గం సుగమం కానుంది.

vishaka
author img

By

Published : Sep 26, 2019, 1:59 PM IST

విశాఖ నౌకాశ్రయానికి మరో ఘనత

తూర్పుతీరంలో సరకు రవాణాకు అతిముఖ్యమైన కేంద్రంగా నిలిచిన విశాఖ పోర్టు....దేశంలోనే ప్రభుత్వరంగ పోర్టుల్లో మూడోస్థానానికి ఎగబాకింది. కార్గో హ్యాండ్లింగ్‌లో అనుకున్న లక్ష్యాన్ని చేరుకునేందుకు భారీ నౌకలను ఆకర్షించేలా చేసిన ప్రయత్నాలు ఫలితాలనివ్వనున్నాయి. సింగపూర్‌లో జరిపిన సిమ్యులేషన్ అధ్యయనం ద్వారా...ఇన్నర్‌ హార్బర్‌, ఔటర్ హార్బర్‌లో అతిభారీ నౌకలను సైతం హ్యాండ్లింగ్‌ చేసే అవకాశం ఉందని పోర్టు అధికారులు చెబుతున్నారు.

క్లీన్ కార్గో సాధించేందు దిశగా అడుగులు వేస్తున్న విశాఖ పోర్టు....కంటైనర్‌ ఎగుమతులు, దిగుమతులపైనే ఎక్కువగా దృష్టి సారించింది. ఆర్థికమాంద్యం ఛాయలు తమపై పడకుండా భారీ నౌకలను ఆకర్షించేలా సింగపూర్‌లో జరిపిన సిమ్యులేషన్ అధ్యయనాలు మంచి ఉపయోగకరంగా మారనున్నాయి.

గని నుంచి నౌక వరకు అన్న సూత్రం పాటించి....ముడి ఖనిజం రవాణాలో ఎలాంటి ఆలస్యం జరగకుండా రవాణా వలయాన్ని అమలు చేస్తున్నారు. బ్యాంకాక్ పోర్టుతో ప్రత్యేకంగా ఒప్పందం చేసుకోనున్నారు. నవంబర్‌లో పోర్టు వినియోగదారులు, వ్యాపార వర్గాలు, విదేశీ సంస్థలతో కలిసి భారీ సమ్మేళనం నిర్వహించనున్నారు..

Intro:సోమశిల కి తగ్గిన వరద

Body:సోమశిల కి తగ్గిన వరద

Conclusion:కిట్ నెంబర్ 698 కరీం నెల్లూరు జిల్లా ఆత్మకూరు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.