వ్యాపార లావాదేవీల్లో తేడాల వల్ల డబ్బులు వసూలు చేసుకునేందుకు ముగ్గురిని కిడ్నాప్ చేసి హింసించిన కేసును విశాఖ పోలీసులు ఛేదించారు. ఫిర్యాదు నమోదైన ఎనిమిది గంటల్లోనే నిందితుల్లో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. మరో నలుగురిని మరికొన్ని గంటల్లోనే అరెస్ట్ చేశారు. గోపాలపట్నం పరిధిలోని ఓ ఆసుపత్రిలో దెబ్బలు తిన్న బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. వారిని నిర్బంధించిన సాగర్ నగర్లోని గృహంపై దాడి చేశారు. అక్కడ కిడ్నాప్ అయిన మరో యువకుని జాడ తెలియకపోవడంతో ఆరు బృందాలుగా విచారణ చేపట్టారు. మొత్తం పదిమంది నిందితులను గుర్తించి, ఆరుగురిని అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపినట్టు ఏసీపీ పెడారావు వెల్లడించారు. బాధితులు కిరణ్ కుమార్, జగదీష్, రాజలను తరుణ్ బృందం డబ్బులు రాబట్టుకునేందుకు కిడ్నాప్ చేశారని పోలీసులు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కిరణ్ కుమార్, తరుణ్ ల మధ్య వ్యాపార లావాదేవీల్లో తలెత్తిన గొడవలే ఈ కిడ్నాప్ దారితీశాయని వివరించారు.
ఇదీ చదవండి
ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు కష్టం... హైకోర్టులో ప్రభుత్వ పిటిషన్