ETV Bharat / state

గూగుల్ ఉమెన్ టెక్ మేకర్.. ఈ అనకాపల్లి అమ్మాయి - గూగుల్ ఉమెన్ టెక్ మేకర్ అవార్డు గెలుచుకున్న అనకాపల్లి సుదీప న్యూస్

తొలి నుంచి విభిన్న ఆలోచనా శైలి. గ్రామీణ ప్రాంతంలో ఉన్న పరిమిత సదుపాయాలతోనే మిగిలిన వారితో పోటీ పడేందుకు ఆసక్తి. ఇంట్లో సమస్యలను అధిగమించి అందరిలో ప్రత్యేకంగా నిలిచి నాయకత్వ లక్షణాలతో మహిళలకు ఒక స్ఫూర్తినివ్వాలన్నదే అనకాపల్లికి చెందిన సుదీప లక్ష్యంగా పెట్టుకుంది. ఆమె లక్ష్యానికి గూగుల్ నుంచి వచ్చిన బహుమతి వెయ్యి ఏనుగుల బలాన్ని తెచ్చినట్టయింది.

vishaka girl  sudeepa  won google women tech maker Award

author img

By

Published : Aug 5, 2020, 11:58 PM IST

గూగుల్ నిర్వహించిన ఆసియా-ఫసిఫిక్ గూగుల్ ఉమెన్ టెక్ మేకర్ పోటీల్లో విశాఖకు చెందిన సుదీప తన ప్రతిభను కనబర్చి అంతర్జాతీయ స్థాయిలో గ్రామీణ నేపథ్యం ఉన్న యువతులు ఎక్కడా తీసిపోరని మరోమారు నిరూపించింది. సాఫ్ట్​వేర్ ఇంజినీర్​గా స్థిరపడాలన్న తన మనోగతంతోపాటు, ఈతరం అమ్మాయిలలో నాయకత్వ లక్షణాలకు ఎక్కడా లోటు లేదని నిరూపించింది. గూగుల్ ప్రతి ఏటా మహిళలలో ఉన్న నైపుణ్యాలను వెలికి తీసి.. ప్రోత్సహించే పోటీ నిర్వహిస్తూ వస్తోంది. ఈసారి ఆసియా-ఫసిఫిక్​లో... 'గూగుల్ ఉమెన్ టెక్ మేకర్​' పోటీలకు 48 దేశాల నుంచి పోటీదారులు తమ ఎంట్రీలను పంపారు. విద్యార్థినులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. భారత దేశం నుంచి 39 మంది ఎంపిక కాగా వారిలో సుదీప ఒకరు.

విశాఖ జిల్లా అనకాపల్లి కి చెందిన కొల్లి శ్రీనివాసరావు, శ్రీదేవి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. చిన్న అమ్మాయి. సుదీప. విజ్ఞాన్ ఇనిస్టిట్యూట్​ ఆఫ్ ఇంజినీరింగ్ లో బిటెక్ రెండో ఏడాది చదువుతున్న ఈ అమ్మాయికి తొలి నుంచి భిన్నమైన ఆలోచనలే. ఆమె ఆలోచనలను సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకుంటోంది. ఈ క్రమంలోనే గూగుల్ నిర్వహించిన ఈ పోటీకి తన ఎంట్రీని పంపి విజయం సాధించింది.

సాంకేతిక రంగంలో మహిళల భాగస్వామ్యం పెంపొందించడం, వారిలో నాయకత్వ లక్షణాలను వెలికితీసి ప్రోత్సహించే కార్యక్రమం గూగుల్ చేపట్టింది. కోడింగ్, అకాడమిక్, లీడర్ షిప్ వంటి రంగాల్లో నిర్దేశించిన ప్రమాణాలను అందుకున్న సుదీప వివిధ ఎంట్రీలతో పోటీ పడింది. ఈ అవార్డు కింద పది వేల యూఎస్ డాలర్ల ను సుదీప గెలుచుకుంది. గూగుల్ నిర్వహించే అంతర్జాతీయ సదస్సుకు కూడా ఆమె హాజరయ్యేందుకు అవకాశం లభించింది.

సుదీప ఇంటర్ చదువుతున్న సమయంలో జరిగిన ఒక రహదారి ప్రమాదం తీవ్ర నిర్వేదంలో పడేసింది. ఆ ప్రమాదంలోనే తల్లికి తీవ్ర గాయాలై మంచానికి పరిమితమైంది. సుదీప కూడా ఈ ప్రమాదంలో గాయపడి కొలుకుంది. ఇవన్నీ సుదీపకు ఇంటర్ పరీక్షలకు.. మరికొన్ని నెలలు ఉండగానే జరగడం కుంగదీసినా.. వాటిని అధిగమించి ఇంటర్​లో మంచి మార్కులు సాధించింది.

సుదీప ఇన్ స్టా గ్రామ్ లోనూ నిత్యం తన అలోచనలను యువత లక్ష్యాలను వివరించే విధంగా పలు కొటేషన్లను పెడుతూ అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది. సుదీప గూగుల్ ఉమెన్ టెక్ మేకర్ పురస్కారానికి ఎంపిక కావడం పట్ల తల్లిదండ్రులు, సోదరి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో సాంకేతిక నిపుణురాలిగా ఎదగాలన్నదే తన లక్ష్యమని సుదీప చెబుతోంది. గూగుల్ ఉమెన్​ టెక్ మేకర్స్ అనకాపల్లి అమ్మాయిని వరించడంతో ఆమె చదువుతున్న విజ్ఞాన్ ఇనిస్టిట్యూట్​ ఆఫ్ టెక్నాలజీ..ఆమెకు లక్ష రూపాయల నగదు బహుమతి అందజేసింది.

ఇదీ చదవండి: ఈ రామ భక్తులు.. రామదాసుకేం తీసిపోరు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.