కేజీహెచ్, ఆరిలోవలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్య సేవలు పొందిన వారి పేర్లను పరిహారానికి నమోదు చేసుకుని తమ పేర్లు విడిచి పెట్టారని కొందరు బాధితులు విశాఖ కలెక్టరేట్‌కు వెళ్లారు. పాలిమర్స్ ఘటన జరిగిన వెంటనే.. గీతం వైద్యాలయంలో చికిత్స పొందిన తమ పేర్లు వదిలి బాధితుల జాబితా సిద్ధం చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందిన వారీగా తమ పేర్లు నమోదు చేయాలని, లేని పక్షంలో ప్రభుత్వం నుంచి వచ్చే నష్టపరిహారం కోల్పోతామన్నారు. గీతం వైద్య విద్య సంస్థలో చికిత్స జరిగిన ..రసీదులు చూపి.. న్యాయం చేయాలని అధికారులను కోరారు.
ఇదీ చదవండి: మనలా ఎవరూ స్పందించలేదు: సీఎం జగన్