విశాఖపట్నం జిల్లా పాడేరు ఘాట్ రోడ్డులో గంజాయి రవాణా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను పోలీసులు పట్టుకున్నారు. మోద కొండమ్మ పాదాల వద్ద తనిఖీలు చేపట్టిన ఎక్సైజ్ సిబ్బంది 60 కేజీల మత్తుపదార్థాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేశారు. వీరిలో ఇద్దరు తమిళనాడుకు చెందినవారు, మరొకరు కేరళకు సంబంధించిన వ్యక్తి. స్మగ్లర్లలో మహిళ కూడా ఉండటం చూసి పోలీసులు ఆశ్చర్యపోయారు. రవాణాకు వినియోగించిన కారును సీజ్ చేసినట్లు ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు.
ఇవీ చదవండి...గంజాయి రవాణాపై ఉక్కుపాదం.. ముగ్గురిపై కేసు