ETV Bharat / state

'28 రోజుల తర్వాత మళ్లీ వ్యాక్సిన్​ ఇస్తాం'

దేశ వ్యాప్తంగా ఇవాళ నిర్వహించే కొవిడ్‌- 19 టీకా ప్రక్రియకు జిల్లాలోనూ సర్వం సిద్ధం చేశారు. ఈ కార్యక్రమం సజావుగా నిర్వహించేందుకు యంత్రాంగం ఏర్పాట్లు చేసిందని జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డాక్టర్‌ సూర్యనారాయణ వెల్లడించారు. అత్యంత జాగ్రత్తగా నిర్వహించే.. కార్యక్రమ వివరాలను ఆయన వెల్లడించారు. అవి ఆయన మాటల్లోనే.

'28 రోజుల తర్వాత మళ్లీ వ్యాక్సిన్​ ఇస్తాం'
'28 రోజుల తర్వాత మళ్లీ వ్యాక్సిన్​ ఇస్తాం'
author img

By

Published : Jan 16, 2021, 9:55 AM IST

Updated : Jan 16, 2021, 10:11 AM IST

'28 రోజుల తర్వాత మళ్లీ వ్యాక్సిన్​ ఇస్తాం'

కొవిడ్‌ టీకా కేంద్రాలలో ఏర్పాట్లు..

ఎంపిక చేసిన కేంద్రాలకు టీకా పంపించాం. హెల్త్‌ కేర్‌ వర్కర్లకు తొలి విడతలో ఇస్తున్నాం. నమోదైన వారి ప్రకారం ప్రతి కేంద్రంలో వంద మందికి రోజూ ఇస్తాం.

అత్యవసర పరిస్థితి తలెత్తితే..

స్వల్ప ఇబ్బందులు గుర్తిస్తే అక్కడి వైద్యాధికారులే చికిత్స అందిస్తారు. అందుకు అనుగుణంగా పడకలు సిద్ధం చేశారు. తీవ్ర సమస్యలు తలెత్తితే కేజీహెచ్‌, విమ్స్‌, అనకాపల్లి, పాడేరు, ఎంపిక చేసిన ప్రభుత్వ అసుపత్రులు, ప్రధమ ప్రయివేటు ఆసుపత్రిలో వైద్య నిపుణులతో కూడిన బృందాలు సిద్ధంగా ఉంటాయి. అంబులెన్స్‌లను ఎక్కడికక్కడ సిద్ధంగా ఉంచుతాం.

నిబంధనలు ఇలా: ప్రతి రోజూ ప్రతి కేంద్రంలో 100 మందికి టీకా ఇచ్చే విధంగా జాబితాలు రూపొందించాం. ఉదయం 9గంటల నుంచి 11 గంటల వరకు కార్యక్రమం సాగుతుంది. టీకా తీసుకున్న తర్వాత అరగంట తప్పని సరిగా కేంద్రంలోనే ఉండాలి.

రెండోసారి ఎప్పుడంటే: తొలిసారి టీకా తరువాత మళ్లీ 28 రోజుల తర్వాత తీసుకోవాల్సిన సమయాన్ని ఎస్‌ఎంఎస్‌ ద్వారా తెలియజేస్తాం. తొలిసారి అనుసరించిన విధానాలే పాటించాలి.

మధ్యలో సమస్య గుర్తిస్తే: టీకా వేసుకున్న తరువాత సమస్య తలెత్తితే 24 గంటల నుంచి 48 గంటల మధ్యే తెలిసిపోతుంది. ఆ తర్వాత సమస్యలు ఉండవన్నది నిపుణులు చెబుతున్న మాట. ఈలోపు ఏ సమస్యలు వచ్చినా ఏఎన్‌ఎం, ఆశా వర్కర్‌ నుంచి వైద్యాధికారి వరకు ఎవరికి చెప్పినా వెంటనే ఆసుపత్రికి తరలిస్తారు. లేదా నేరుగా కూడా ఆసుపత్రికి వెళ్లొచ్చు.

నావికాదళానికి: నావికాదళానికి కూడా టీకా పంపుతున్నాం. ఇది పూర్తిగా కేంద్రం ప్రభుత్వ నిర్దేశాల మేరకు చేస్తున్నాం. కేంద్రం ఆదేశించిన విధంగా కేంద్ర ప్రభుత్వ విభాగాలు, సంస్ధలకు టీకా డోస్‌లను అందిస్తున్నాం. నేవీ సహా ఇతర విభాగాలకు వారు నిర్ణయించిన ప్రకారం ఇస్తున్నాం. టీకాలను ఎవరికి వేయాలి, ఎలా ఇవ్వాలన్నది వారు చూస్తారు. దీనికి అయ్యే వ్యయం కేంద్రమే చూసుకుంటుంది.

మినహాయింపులు: గర్భిణులు, పిల్లలకు పాలిచ్చే తల్లులు, 18 లోపు వారు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌తో బాధపడుతున్నవారిని టీకా కార్యక్రమం నుంచి మినహాయించాం.

ప్రధానితో వీడియో సమావేశం: టీకా తీసుకునే వారితో ప్రధాని మోదీ నేరుగా మాట్లాడే అవకాశం ఉంది. విజయవాడ, విశాఖలలో ఈ సదుపాయం ఏర్పాటు చేశారు. విశాఖలో కేంద్రానికి జిల్లా ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికార్లను కూడా ఆహ్వానించాం. మిగిలిన కేంద్రాలలో ప్రధాని కార్యక్రమాన్ని వీక్షించేందుకు ప్రత్యేకంగా డిజిటల్‌ తెరలను ఏర్పాటు చేశాం.

  • జిల్లాలో టీకా కార్యక్రమం నిర్వహించే కేంద్రాలు 32
  • రోజుకు 3,200 మందికి
  • తొలి విడతలో మొత్తంగా 38,000 మందికి (సుమారు)
  • వీరికి మళ్లీ టీకా వేసేది 28 రోజుల తరువాత

ఇదీ చదవండి:

ఆమె ప్రపంచం నిశ్శబ్దం.. చిత్రాలు మాత్రం అత్యద్భుతం

Last Updated : Jan 16, 2021, 10:11 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.