భారీ వర్షాల దృష్ట్యా జిల్లాలోని అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని విశాఖ జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ అధికారులను ఆదేశించారు. రేపు ఉదయం తీవ్రత పెరిగి విశాఖ - నరసాపురం మధ్య తీరం దాటుతుందని.. వాతావరణ శాఖ సమాచారంతో జిల్లాలోని అధికారులతో సమీక్షలు జరిపారు. ఆర్డీవోలు, ఇరిగేషన్, వ్యవసాయం, మత్య్స శాఖ, రహదారులు భవనాల శాఖ, తదితర శాఖల అధికారులతో మాట్లాడారు. జలాశయాలకు దిగువనున్న గ్రామస్థులను అప్రమత్తం చేసి నీటిని విడుదల చేస్తునట్టు కలెక్టర్ చెప్పారు.
పంట నష్టాలను పరిశీలించి నివేదికలను అందజేయాలని వ్యవసాయ శాఖ, ఉద్యాన వన శాఖ అధికారులను కలెక్టర్ వినయ్ చంద్ ఆదేశించారు. గ్రామ సచివాలయాల్లోని వ్యవసాయ సహాయకులు అప్రమత్తతతో ఉండాలని అన్నారు. రహదారులలో ఎక్కడైనా చెట్లు కూలి రవాణాకు అంతరాయం కలిగితే తక్షణమే వాటిని తొలగించేందుకు చర్యలు తీసుకొని ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో టోల్ ఫ్రీ నెంబర్ 0891-2590102, 0891-2590100 ఏర్పాటు చేశారు.
ఇదీ చదవండి: