ఉత్తరప్రదేశ్లోని బలరాంపూర్ కి చెందిన విశాఖలో మనీషాపై జరిగిన అత్యాచారాలను వ్యతిరేకిస్తూ విశాఖలోని అంబేద్కర్ సోసైటీ ఆందోళన చేపట్టింది. ఆ రాష్ట్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ జీవీఎంసీ గాంధీ పార్క్ లో నిరసన ప్రదర్శన చేపట్టారు. భాజపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దళితులపై దాడులు పెరిగాయన్నారు. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం మైనార్టీల విషయంలో భాధ్యతారాహిత్యంగా వ్యవహరించటం సరికాదన్నారు. ముఖ్యమంత్రి తన పదవికి రాజీనామా చేయాలని అన్నారు. దళిత బాలికలపై అత్యాచారానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండీ...బిహార్ బరి: సీట్ల సర్దు'బాట'.. ఇట్లాగన్న మాట!