ETV Bharat / state

'మన్యంలో రక్త పిశాచి'

మేనత్తే చిన్నారి పాలిట యమపాశమైంది. అభం శుభం తెలియని ఆరేళ్ల పాపను బలితీసుకుంది. పెద్దలు పెట్టుకున్న గొడవ ఇంతటి అమానవీయ ఘటనకు దారితీసింది.

vishaka_agency_niece_murdered by aunt
author img

By

Published : Feb 12, 2019, 4:09 PM IST

విశాఖపట్నం జిల్లా పెద బయలు మండలం లకేయుపుట్టులో ఆరేళ్ల బాలిక కొర్ర అనితను.. ఆమె మేనత్త దారుణంగా హతమార్చింది. అభం శుభం ఎరుగని చిన్నారిని అతి కిరాతకంగా నరికి చంపేసింది. అక్కడితో ఆగకుండా.. ఆ చిన్నారి రక్తాన్నీ తాగిందని గ్రామస్థులు చెబుతున్నారు. నిందితురాలిని లక్ష్మీపేట పంచాయతీ కప్పాడు వాసి వంతాల రస్మో గా గుర్తించారు. ఆమె నెల నుంచి తమ్ముడి ఇంట్లో ఉంటోంది.

4 రోజుల కిందట తమ్ముడి భార్యతో గొడవపడింది రస్మో. మాటామాటా అనుకున్నారు. పాపను చంపేస్తానని బెదిరించిందామె. ఈ హెచ్చరికను పెద్దగా పట్టించుకోలేదు తమ్ముడి భార్య. ఆమె మాటలను మాత్రం రస్మో మనసులో పెట్టుకుంది. కట్టెల కోసమని చిన్నారిని కొండపైకి తీసుకెళ్లి కత్తితో దాడి చేసి చంపింది. విషయం తెలుసుకున్న గ్రామస్థులు... వెళ్లి చూడగా అప్పటికే బాలిక మృతి చెందింది.

ఆగ్రహించిన గ్రామస్థులు నిందితురాలిని పట్టుకొని చెట్టుకు కట్టారు. పోలీసులకు విషయంపై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు.

Ahmedabad (Gujarat), Feb 12 (ANI): While addressing the party workers in Gujarat's Ahmedabad on Tuesday, BJP president Amit Shah said, "I roam around the country from Northeast to Kanyakumari and from Assam to Gujarat, I see Prime Minister Narendra Modi has rock-solid support of people ahead of the coming Lok Sabha elections. No need to teach BJP workers the art of contesting election as I am also here by working on a booth."

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.