ETV Bharat / state

రాష్ట్రంలో తొలి జీఐఎస్‌ విద్యుత్‌ ఉపకేంద్రం - ప్రారంభించిన సీఎం చంద్రబాబు

రాష్ట్రంలో తొలి జీఐఎస్‌ విద్యుత్‌ ఉపకేంద్రాన్ని ప్రారంభించిన చంద్రబాబు

Chandrababu Inaugurate Substations
Chandrababu Inaugurate Substations (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 7, 2024, 12:57 PM IST

Updated : Nov 7, 2024, 2:39 PM IST

Chandrababu Inaugurate Substations : రాష్ట్రంలో తొలి జీఐఎస్‌ విద్యుత్‌ ఉపకేంద్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభోత్సవం చేశారు. తాళ్లాయపాలెంలో రూ.505 కోట్లతో నిర్మించిన 400/220కేవీ గ్యాస్‌ ఇన్సులేటెడ్‌ సబ్‌స్టేషన్​ ప్రారంభించారు. ఇక రాజధాని అమరావతికి అంతరాయం లేని కరెంట్ సరఫరా కానుంది. రాజధానికి ఇప్పటివరకు తాడికొండ కేంద్రం నుంచి కరెంట్ సరఫరా అవుతోంది.

ఈ క్రమంలోనే చంద్రబాబు జీఐఎస్​తో కలుపుకొని రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో 5 సబ్​స్టేషన్లను వర్చువల్ విధానంలో ప్రారంభించారు. మొత్తంగా 14 సబ్​స్టేషన్లు, లైన్ల నిర్మాణాలకు సంబంధించి సీఎం భూమి పూజ చేశారు. విద్యుత్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంలో భాగంగా ఏపీ ట్రాన్స్​కో నూతన సబ్​స్టేషన్లను ఏర్పాటు చేసింది. మరోవైపు రూ.5407 కోట్ల వ్యయంతో ఎన్టీఆర్, గుంటూరు, చిత్తూరు, నంద్యాల, శ్రీ సత్యసాయి, శ్రీకాకుళం, అనకాపల్లి, కృష్ణా, ప్రకాశం, తిరుపతి, కడప జిల్లాల పరిధిలోని 132/33 కేవీ, 220/132 కేవీ, 400/220 కేవీ, వివిధ సామర్థ్యాలతో సబ్​స్టేషన్లు/లైన్లను నూతనంగా ఏర్పాటు చేయనున్నారు.

విద్యుత్ రంగంలో నూతన సంస్కరణల వల్ల నాణ్యమైన విద్యుత్ అందుబాటులోకి వస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. లో ఓల్టేజ్, షార్ట్ సర్క్యూట్ సమస్యలు తాజా విధానంలో గణనీయంగా తగ్గుతాయన్నారు. ఆక్వా రైతులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా ఎంతో లాభసాటిగా ఉంటుందని చెప్పారు. బేతంచర్ల సబ్ స్టేషన్ గత ఐదేళ్లు వైఎస్సార్సీపీ ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురైందని విమర్శించారు. అన్ని ప్రాంతాలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసే విధానానికి శ్రీకారం చుడుతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టంచేశారు.

అంతకుముందు వివిధ ప్రాంతాల్లో వర్చువల్‌గా సబ్​స్టేషన్ల ప్రారంభించిన చంద్రబాబు స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులతో మాట్లాడారు. ఇచ్చాపురం సబ్​స్టేషన్ ప్రారంభోత్సవంలో ఎంపీ ఎక్కడా అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. పిలిచారా లేదా అని కలెక్టర్​ని అడిగారు. ఎంత బిజీగా ఉన్నా ప్రజలకి దూరం అవకూడదంటూ కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడును ఉద్దేశించి సీఎం వ్యాఖ్యానించారు. జూమ్‌లో అయినా జాయిన్ అవ్వాల్సిందని చంద్రబాబు సూచించారు.

GIS Substation in Amaravati : మరోవైపు రాబోయే రోజుల్లో కరెంట్​ డిమాండ్ దృష్ట్యా విద్యుత్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంపై విద్యుత్ సంస్థలు దృష్టి సారించాయి. పెరుగుతున్న విద్యుత్ డిమాండ్​ని తీర్చే దిశగా చర్యలు చేపట్టనున్నాయి. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో కూడా వృద్ధిని సాధించడంలో నాణ్యమైన నమ్మకమైన 24x7 గంటల కరెంట్ సరఫరాలో కీలక పాత్ర పోషించనున్నాయి. ఏపీలో గణనీయంగా పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ అందించడమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి.

గుడ్​న్యూస్ - నిరంతరాయంగా విద్యుత్ - ఇక కోతలు ఉండవు

Last Updated : Nov 7, 2024, 2:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.