ETV Bharat / state

మగ్గం మూగబోయింది... చేనేత అచేతనం అయింది - ap taza varthalu

హిందూ వివాహ సంప్రదాయంలో మధు పర్కాలకు ఎంతో విశిష్టత ఉంది. మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యే జంట జీలకర్ర బెల్లం పెట్టె సమయంలో మధు పర్కాలు ధరించడం ఆనవాయితీ. ఇలాంటి మధుపర్కాలు నేసే చేనేత కార్మికుల జీవితాలు ఇప్పుడు దుర్భరంగా మారింది. కరోనా కారణంగా.. వివాహాలు జరగక పోవడం వల్ల ఈ వస్త్రాలు కొనుగోలు ఆగిపోయింది.. నేతన్నల కష్టాలపై ఈటీవీ భారత్ అందిస్తున్న ప్రత్యేక కథనం.

మగ్గం మూగబోయింది... చేనేత అచేతనం అయింది
మగ్గం మూగబోయింది... చేనేత అచేతనం అయింది
author img

By

Published : May 29, 2020, 3:55 PM IST

విశాఖ జిల్లా కశింకోట మండలం బంగారయ్య పేట మధుపర్కాల నేతకు పెట్టింది పేరు. ఇక్కడ నేసిన మధుపర్కాలు ఉత్తరాంధ్రలోని ఇతర ప్రాంతాలకు ఎగుమతి అవుతుంటాయి. కరోనా లాక్​డౌన్​ కారణంగా వివాహాలు నిలిచిపోవటం వల్ల వస్త్రాల కొనుగోలు తగ్గిపోయింది. వేసవి వచ్చిందంటే వస్త్ర నేతతో కళకళలాడే మగ్గాలు.. మూగబోయాయి. ఎంతో శ్రమతో కూడుకున్న మధుపర్కాలను అలవోకగా నేసే ఈ నేతన్నలు పనిలేక పస్తులుండాల్సిన పరిస్థితి నెలకొంది.

శ్రమతో కూడిన వస్త్ర తయారీలో ఇక్కడి చేనేత కార్మికులు చూపుతున్న చొరవ పలువురి ప్రశంసలు అందుకుంటున్నా... తమ బతుకుల్లో మాత్రం వెలుగు లేదని పలువురు చేనేత కార్మకులు వాపోతున్నారు. శ్రీ సాంబమూర్తి చేనేత సహకార సంఘంలో గతంలో 350 మంది సభ్యులుగా ఉండేవారు. నేసిన వస్త్రాలకు గిట్టుబాటు ధర రాక చాలా కుటుంబాలు ఇతర ప్రాంతాలకు వలసవెళ్లిపోయాయి. ప్రస్తుతం 150 కుటుంబాలు మాత్రమే ఈ సంఘంలో ఉన్నాయి.

మగ్గం నేసేవారికి రోజుకు రూ.200 మాత్రమే వస్తుండగా మర్రాష్, కండ్లు చుట్టడం, డబ్బాలు తొడడం చేసేవారికి రూ.20 నుంచి రూ.70 వరకు ఆదాయం వస్తుంది. ముడి సరకు ధరలు పెరిగిపోతున్న సమయంలో... వచ్చే అరకొర ఆదాయం సరిపోవడంలేదని నేతన్నలు ఆవేదన చెందుతున్నారు. ఈ సమయంలో కరోనా లాక్​డౌన్ తమను మరింత ఇబ్బందుల్లోకి నెట్టిందన్నారు.

నేతన్న నేస్తం కింద మగ్గం ఉన్నవారికి ఏడాదికి రూ.24 వేలు చొప్పున ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తోంది. కానీ చేనేత వస్త్ర తయారీలో చాలామంది కష్ట పడితేనే గాని మగ్గం వద్దకు ముడి సరుకు రాదు. చేనేత వస్త్ర తయారీలో భాగస్వాములు అవుతున్న మిగిలిన వారికి నేతన్న నేస్తం అందడంలేదని కార్మికులు అంటున్నారు.

చేనేత రంగాన్ని ఆదుకునేందుకు మగ్గంతో పాటు కండ్లు చుట్టేవారికి, డబ్బాలు తొడేవారికి, మర్రాస్​కి నేతన్న నేస్తం సాయాన్ని అందించాలని కోరుతున్నారు. చేనేతపై ఆధారపడి జీవిస్తున్న తమను ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకుంటున్నారు.

ఇదీ చదవండి : కడపలో విమాన సేవలు షురూ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.