ETV Bharat / state

భూమి తీసుకున్నది సొమ్ములు కోసమైతే వేదం కోసం అంటారేంటి! - స్వరూపానందేంద్ర సరస్వతి

Visakha Sarada Peetham Letter to CM Jagan: ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాల కోసమంటూ ప్రభుత్వాన్ని భూమి అడిగారు. సరే అడిగింది మన రాజగురువే కదా అని జగన్‌ సర్కార్‌ అత్యంత కారు చౌకగా 225 కోట్ల భూమిని 15 లక్షలకే కేటాయిస్తూ జీవో జారీ చేసింది. ఇంతలో ఏమనుకున్నారో మరి పీఠాధిపతి భూములని ఆధ్వాత్మిక అవసరాల కోసం కాదు. పీఠం ఆదాయం కోసమే అడిగామంటూ మాట మార్చారు. ఆ మేరకు జీవోను మళ్లీ మార్చి ఇవ్వాలంటూ ఆయన వారసుడు పీఠం ఉత్తరాధికారి సీఎం జగన్‌కి లేఖ రాశారు. వెంటనే ప్రభుత్వమూ స్పందించింది.

Visakha_Sarada_Peetham_Letter_to_CM_Jagan

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 12, 2024, 1:53 PM IST

భూమి తీసుకున్నది సొమ్ములు కోసమైతే వేదం కోసం అంటారేంటి!

Visakha Sarada Peetham Letter to CM Jagan : ఆయన పేరు స్వరూపానందేంద్ర సరస్వతి. స్వయం ప్రకటిత పీఠాధిపతి. విశాఖ సమీపంలోని పెందుర్తిలో తన పీఠానికి ఆయనే సర్వాధికారి. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ ముఖ్యమంత్రికి రాజగురువుగా ఆయనో వెలుగు వెలుగుతున్నారు. అధికార పార్టీ నేతలు విశాఖలోని అత్యంత విలువైన ప్రభుత్వ భూముల్ని, ప్రాజెక్టుల్ని ఎడాపెడా కొట్టేయడం చూసిన ఆయనకు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న ఆశ పుట్టినట్టుంది.

సముద్ర తీరానికి అత్యంత సమీపంలోని 15 ఎకరాల ప్రభుత్వ భూములపై కన్నేశారు. సంస్కృత పాఠశాలను నెలకొల్పి, వేద విద్య వ్యాప్తికి, పీఠం కార్యకలాపాల నిర్వహణకు భూములు కేటాయించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్టు అంతటి రాజగురువే అడిగితే అధికార యంత్రాంగం ఊరుకుంటుందా? చకచకా దస్త్రం కదిలింది. మంత్రివర్గం భక్తిశ్రద్ధలతో ఆమోదం తెలిపింది. జీవీఎంసీ నాలుగో వార్డు పరిధిలో భీమిలి పట్టణాన్ని ఆనుకుని ఉన్న కొండపై సర్వే నంబరు 102/2లో 7.70 ఎకరాలు, 103లో 7.30 ఎకరాలు ప్రభుత్వం కేటాయించింది. ఎకరం 15 కోట్ల చొప్పున సుమారు 225 కోట్ల విలువ చేసే ఆ భూముల్ని శారదా పీఠానికి ఎకరం లక్ష చొప్పున 15 లక్షలకు కట్టబెడుతూ ప్రభుత్వం 2021లో జీవో ఇచ్చేసింది.

Protect Temple Lands In Dachepalli: దేవాలయ భూముల్ని కాపాడాలంటూ ఆందోళన

అయితే జీవోలో వేద, సంస్కృత పాఠశాలకు భూములు కేటాయించినట్టు రాయడంతో రేపు ప్రభుత్వం మారితే వాటిని వేరేలా వాడుకోవడం కుదరదని అనుకున్నారో ఏమో ఇంతలోనే మాట మార్చారు. పీఠం కార్యకలాపాలకు అవసరమైన ఆదాయ సముపార్జన కోసమే సాగర తీరంలో, అదీ వాణిజ్య, నివాస ప్రాంతాలకు సమీపంలోని భూములు కేటాయించాలని కోరామని స్వరూపానందేంద్ర వారసుడు, పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర చెప్పారు. కానీ జీవోలో వేదవిద్య వ్యాప్తికి, పీఠం కార్యకలాపాల విస్తరణకు అని రాశారంటూ 2023 నవంబరు 20న సీఎంకి లేఖ రాశారు.

ఆ కార్యకలాపాల్ని ఇప్పటికే 60 కేంద్రాల్లో చేస్తున్నామని ఆ భూముల్ని జీవోలో ప్రస్తావించిన అవసరాల కోసం వాడుకోవాల్సిన పనిలేదని స్పష్టం చేశారు. వేదపాఠశాల, సంస్కృత విద్య వ్యాప్తికి ఆ స్థలం కోరినట్టు జీవోలో పొరపాటున రాసినట్టున్నారన్న ఆయన జీవోలో మార్పులు చేయాల్సిందిగా కోరుతున్నట్లు ముఖ్యమంత్రికి రాసిన లేఖలో తెలిపారు. సీఎం కార్యాలయం వెంటనే స్పందించింది. దస్త్రం సిద్ధం చేయాలని సూచిస్తూ ఆ లేఖను రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి పంపింది.

Temple lands: దేవాలయ భూములు.. అప్పనంగా దోచుకుంటున్న పెద్దలు

రాజగురువుపై భక్తిప్రపత్తుల ప్రకటన భూమి కేటాయింపుతో ఆగలేదు. ఆ భూమికి వాణిజ్య విలువ పెంచేందుకు వీఎంఆర్‌డీఏ 2 కోట్లతో 1.20 కిలోమీటర్ల ఘాట్‌రోడ్డును 40 అడుగుల మేర విస్తరించింది. ఇతర నిర్మాణాలూ చేపట్టింది. ఆ పీఠం భూముల కోసమే రోడ్డు వేస్తే విమర్శలు వస్తాయని మొదట అక్కడ వీఎంఆర్‌డీఏకి 50 ఎకరాలు కేటాయించారు. వీఎంఆర్‌డీఏ భూమి కోసం రహదారి విస్తరణ సాకుతో శారదా పీఠం భూమికి లబ్ధి చేకూర్చారు.

Temple land Kabja: వైసీపీ నాయకుల అండ.. ఆలయ భూమిపై పూజారి కన్ను.. గ్రామస్థుల ఆందోళన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.