విశాఖలోని ఆంధ్రా సరిహద్దు ప్రాంతాన్ని ఒడిశా వాసులు ఆక్రమిస్తున్నారని స్థానిక యువకులు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆంధ్రా-ఒడిశా సరిహద్దు పెదబయలు మండలం కొజ్జిరిగూడ, మెట్టగూడ గ్రామాలు సరిహద్దుల్లో ఉన్నాయి. ఒడిశా మల్కనగిరి జిల్లా గొందిగుడ గ్రామం సరిహద్దులో ఉంది. లాక్డౌన్ 50 రోజుల పాటు ఆంధ్రావాసులు ఇటు రావద్దంటూ చెట్లను నరికి పడేశారు. అయినప్పటికీ వస్తున్నారని స్థానిక యువకులు పాడేరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఒడిశావాసులు చొచ్చుకు వచ్చిన ఆంధ్రా భూభాగాన్ని స్వాధీనం చేసుకోవాలని కోరారు.
ఇదీ చూడండి మిషన్ బిల్డ్ ఏపీపై తదుపరి విచారణ ఈ నెల 26కి వాయిదా