ETV Bharat / state

సింహాద్రి అప్పన్న చందనోత్సవం ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, పోలీస్ కమిషనర్ - చందనోత్సవం వివరాలు

Simhadri Appanna Chandanotsavam: ఈ నెల 23న జరగనున్న సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి చందనోత్సవ కార్యక్రమ ఏర్పాట్లను విశాఖ కలెక్టర్, పోలీసు కమిషనర్ పరిశీలించారు. ఏర్పాట్లపై ఆలయ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఏర్పాట్లపై సింహాచలం ఈవో వి. త్రినాధరావుతో సమాలోచనలు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.

Simhadri Appanna
సింహాద్రి
author img

By

Published : Apr 5, 2023, 8:04 PM IST

సింహాద్రి అప్పన్న చందనోత్సవం ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

Simhadri Appanna Chandanotsavam: సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి చందనోత్సవం ఈ నెల 23న జరగనుంది. ఈ నేపథ్యంలో భక్తులకు కల్పించాల్సిన సదుపాయాలపై బుధవారం జిల్లా అధికార యంత్రాంగం క్షేత్ర స్థాయి పరిశీలన జరిపింది. విశాఖ జిల్లా కలెక్టర్ ఎ.మల్లికార్జున, నగర పోలీస్ కమిషనర్ సిహెచ్ శ్రీకాంత్, జాయింట్ కలెక్టర్ విశ్వనాధ్, డీసీపీలు సునీల్ సుమిత్. ఆనంద్ రెడ్డి.. ఇతర పోలీసు, వివిధ విభాగాల ఉన్నతాధికారులు సింహాచలం ఈవో వి త్రినాధరావు తో కలిసి చందనోత్సవ ఏర్పాట్లను పలు ప్రాంతాల్లో పరిశీలించారు.

తొలుత వీరంతా కళ్యాణ వేదిక వద్దకు చేరుకొని క్యూలైన్ల మార్గాలు, భక్తులు వాహనాలు పార్కింగ్ ఇతర సదుపాయాలు కోసం ఉత్సవ మాస్టర్ ప్లాన్​ను పరిశీలించారు. ఆలయ అధికారులు, పూజారులను అడిగి పలు వివరాలు తెలుసుకున్నారు. ఉచిత దర్శనంతో పాటుగా... 300, 1000, 1500 క్యూ లైన్లు ఏ విధంగా వేగంగా ముందుకు సాగుతాయని ఈఓ త్రినాధ్ రావును, ఈఈ ని అడిగి తెలుసుకున్నారు. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాసరాజు వీరికి వివిధ క్యూలైన్లు చూపించారు. గత ఏడాది ఏర్పాటుచేసిన క్యూలైన్​లకు ఈ ఏడాది ఏర్పాటుచేసిన వాటికి వ్యత్యాసం కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. క్యూలైన్లు వేగవంతంగా సాగేందుకు అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలని దేవస్ధానం అధికారులుకు కలెక్టర్ సూచించారు. భక్తులు ఎక్కువసేపు వేచి చూడకుండా వేగవంతంగా సంతృప్తికరమైన దర్శనం కల్పించేలా చూడాలని కోరారు. అనంతరం ఆలయ ప్రాంగణం తో పాటు వివిధ మార్గాల రూట్లను పరిశీలించారు.

సామాన్య భక్తులతో పాటు వీఐపీ, ప్రోటోకాల్ ప్రముఖులు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా స్వామి వారిని దర్శించుకోవాలని, అందుకు తగ్గ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. అనంతరం కలెక్టర్, పోలీస్ కమిషనర్ సంయుక్తంగా ఏఏ మార్గాల్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని కాసేపు మాట్లాడుకున్నారు. అప్పన్న ధర్మకర్తల మండలి సభ్యులు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ... గత ఏడాది నిజరూప దర్శనం ఉత్సవం పూర్తి స్థాయి లో విజయవంతం అయినట్లు వెల్లడించారు.

ఈ ఏడాది సైతం భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని వెల్లడించారు. అందరి సహకారముతో చందనోత్సవం విజయవంతం చేద్దామని కలక్టర్ మల్లికార్జున అన్నారు. అన్ని ఏర్పాట్లు పూర్తి స్థాయిలో పక్కాగా చేసుకోవాలి అన్నారు. ఆనంతరం కలెక్టర్, కమిషనర్ సింహాద్రి నాథుడిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఈఓ త్రినాధ్ రావు ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో అప్పన్న ధర్మ కర్తల మండలి సభ్యులు.. గంట్ల శ్రీను బాబు, దినేష్ రాజ్, సంపంగి శ్రీను, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.