విశాఖ ఏజెన్సీలోని హుకుంపేట, డుంబ్రిగుడ మండలాల్లోని గ్రామాల్లో చాలామంది కోవిడ్ బారిన పడుతున్నారు. ముఖ్యంగా హుకుంపేట మండలం సన్యాసమ్మ పాలెంలో ఇంటింటా కరోనా బాధితులు ఎక్కువయ్యారు. వీరిలో 10 మంది వరకు పాడేరు వైటీసీ క్వారైంటైన్ సెంటర్లో, కొవిడ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరో 20 మంది హోమ్ ఐసోలేషన్లో ఉన్నారు.
ఈ గ్రామంలో గత ఏడాది కరోనాతో ఒకే ఇంట్లో ముగ్గురు చనిపోయారు. ఇప్పుడు 2 రోజుల్లో ఇద్దరు చనిపోయారు. సుమారు 30 మంది వరకు ఇంటికి ఒకరు ఇద్దరు చొప్పున కొరోనా బారినపడ్డారని గ్రామస్థులు తెలిపారు. తక్షణమే కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించి మెరుగైన వైద్య సేవలు అందించాలని స్థానికులు, గిరిజన సంఘం సభ్యులు కోరుతున్నారు.
ఇదీ చదవండి:
'ప్రజల్లో చైతన్యంతోనే కరోనా కట్టడి'.. మరీ ఈ గుర్రపు స్వారీలేంటి?!