విశాఖ జిల్లా చీడికాడ మండలంలోని పలు గ్రామాల ప్రజలు గ్రామాల అభివృద్ధికి ఉత్సాహంగా శ్రమదానం చేస్తున్నారు. చీడికాడ, చుక్కపల్లి, దేవరాపల్లి మండలంలోని దేవరాపల్లి, కాశీపురం గ్రామాలకు చెందిన వైకాపా శ్రేణులు, ప్రజలు సమిష్టిగా రహదారులు బాగు చేసుకుంటున్నారు. ఆయా గ్రామాల్లోని రహదారులకు ఇరువైపులా పెరిగిన తుప్పలు తొలగించారు. ఎమ్మెల్యే ముత్యాలనాయుడు స్ఫూర్తితో తుప్పలు తొలగించేందుకు ముందుకు వచ్చినట్లు వైకాపా నాయకులు తెలిపారు. తుప్పలు తొలగించి రహదారులు బాగుపడటంతో ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చూడండి...