విశాఖ జిల్లా పాయకరావుపేట మండలం రాజవరం గ్రామంలో ఇళ్ల స్థలాల పంపిణీ జాబితా తయారీలో అర్హతలేని వారికి కూడా చోటు కల్పించారని ఆరోపిస్తూ స్థానిక తహసీల్దార్ కు గ్రామస్థులు ఫిర్యాదు చేశారు. గ్రామ వాలంటీర్లు 59 మందిని ఇళ్ల స్థలాల అర్హుల జాబితాలో చేర్చారని… అయితే వీరంతా సొంత ఇల్లు ఉన్న వారని, కొందరు ఇతర రాష్ట్రాలకు చెందిన వారని వివరించారు.
దీనిపై స్థానిక రెవెన్యూ అధికారులు విచారణ చేపట్టి అర్హులకు న్యాయం చేయాలని గ్రామస్థులు కోరారు.
ఇవీ చదవండి: కొలిక్కిరాని నర్సింగ్ పోస్టుల భర్తీ