విశాఖ తూర్పు నియోజక వర్గ శాసన సభ్యుడు వెలగపూడి రామ కృష్ణ బాబు కలెక్టర్ వినయ్ చంద్‌ను కలిసి ఎక్సైజ్ పోలీసులపై ఫిర్యాదు చేశారు. తమ అనుచరులకు చెందిన బార్ల పై ఎక్సైజ్ పోలీసులు జరిపిన దాడులపై ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎక్సైజ్ శాఖ పోలీసులే బార్లోకి చొరబడి బ్రాండ్ లేబుళ్లు తొలగించారంటూ ఆరోపించారు. దాడికి సంబంధించిన సీసీ టీవీ ఫుటేజ్ ఆధారాలు కలెక్టర్‌కు సమర్పించారు. ఈ ఘటనపై విచారణ చేపట్టి.. న్యాయం చేయాలని కలెక్టరును కోరారు.
ఇదీ చదవండి : కరోనాపై అవగాహనకు పోలీసుల 'డ్యాన్స్ బేబీ డ్యాన్స్'