విశాఖపట్నం జిల్లాలో కస్తూర్బా గాంధీ విద్యాలయాల స్థాయి పెంచితూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే ఎంపిక చేసిన విద్యాలయాల్లో ఇంటర్ కోర్సులను ప్రవేశపెట్టారు. ఈ ఏడాదికి పదిహేడు కేజీబీవీలలో చేరేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.
స్థాయి పెరిగిన కేజీబీవీలు:
అరకువాలీ, అచ్యుతాపురం, దేవరాపల్లి, డుంబ్రిగుడ, జీకే వీధి, వి.మాడుగుల, హుకుంపేట, కశింకోట, నాతవరం, కోటఉరట్ల, మాకవరపాలెం, ముంచింజీపుట్, నర్సీపట్నం, పెదబయలు, రావికమతం, ఎస్.రాయవరం, జి.మాడుగుల.
ఈ ఏడాది ఇంటర్ మొదటి సంవత్సరంలో చేరేందుకు ఎంపీసీ, బైపీసీ కోర్సులను ప్రవేశపడుతున్నట్టు సమగ్ర శిక్ష అదనపు పథక సమన్వయ కర్త తెలిపారు. ఒక్కో విద్యాలయంలో 40 సీట్లను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. సీట్ల భర్తీకి సంబంధించి తల్లి, తండ్రి లేని, వెనుకబడిన, ఎస్సీ, ఎస్టీ, వైకల్యం, బీపీఎల్బాలికలు దరఖాస్తు చేసుకోవచ్చుననీ పేర్కొన్నారు. ఆసక్తి కలవారు ఆధార్ కార్డు, తెల్లరేషన్ కార్డు, పదవ తరగతి మార్కుల జాబితాతోపాటు కుల, ఆదాయ ధ్రువపత్రాలు ఆయా విద్యాలయం ప్రత్యేక అధికారులకు సకాలంలో అందజేయాల్సి ఉంటుందని వివరించారు.
ఇదీ చదవండి:
ప్రపంచ స్మార్ట్‌సిటీ అవార్డుల పోటీలో.. తుది జాబితాలో విశాఖకు చోటు