విశాఖ బీచ్ రోడ్ ప్రతిమ ప్యారడైజ్ అపార్ట్ మెంట్ వద్ద ఓ వ్యక్తి పై గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడికి పాల్పడ్డారు. గాయపడిన ఆ వ్యక్తిని కేజీహెచ్‌కి తరలిస్తుండగా మృతి చెందాడు. సమాచారం అందుకున్న మహారాణిపేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు.
మృతుడు పశ్చిమగోదావరి ప్రాంతానికి చెందిన గోపాలకృష్ణగా పోలీసులు గుర్తించారు. అతడు కొంతకాలంగా బీచ్ రోడ్‌లోని అపార్ట్ మెంట్లో నివాసం ఉంటున్నట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దాడికి పాల్పడిన వ్యక్తుల కోసం అన్వేషిస్తున్నారు.
ఇదీ చదవండి: