విశాఖ జిల్లా సీలేరు జల విద్యుత్ కేంద్రంలో మొదటి యూనిట్ ఆధునీకరణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక్కొక్కటి 60 మెగావాట్ల సామర్థ్యం గల 4 యూనిట్లు ఉన్నాయి. ఇందులో మొదటి రెండు యూనిట్లు విదేశీ పరిజ్ఞానంతో నిర్మించారు. మిగతా రెండు యూనిట్ల స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మాణాలు ఊపందుకున్నాయి. మొదటి యూనిట్ మార్చి మొదటి వారంలో మరమ్మతుల గురి కాగా.. అంతకుముందే మూడు నెలలకు పూర్వమే ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కంపెనీతో బాగు చేయించినప్పటికీ పరిస్థితి మళ్లీ మూడు నెలలకే పడకేసింది.
నిష్ప్రయోజనం..
అప్పుడే మరమ్మతులు చేసిన ఆ ఇంజనీరింగ్ కంపెనీ వచ్చి మరమ్మతులు చేయడానికి ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఈలోగా లాక్డౌన్ ఏర్పడటంతో ఈ పనులకు అంతరాయం ఏర్పడింది. అనంతరం ఆ కంపెనీకి చెందిన ప్రతినిధులు యూనిట్‌ను బాగు చేయించడానికి ప్రయత్నించారు.
అందుకే ఆదేశాలు వచ్చాయి..
రెండుసార్లు యూనిట్ బాగానే పనిచేసినా క్రమంగా మళ్లీ మొరాయించింది. ఇక చేసేదీ లేక సదరు యూనిట్‌ను ఆధునీకరించడానికి అవసరమైన చర్యలను తీసుకోవాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందాయి. ఈ మేరకు మొదటి యూనిట్ ఆధునీకరణకు అవసరమైన ప్రతిపాదనను స్థానిక అధికారులు చేస్తున్నారు.
సాధ్యమైనంత త్వరగా..
సాధ్యమైనంత త్వరగా ప్రతిపాదనలు తయారు చేసి మొదటి యూనిట్‌ను వినియోగంలో తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నామని జెన్కో కార్యనిర్వాహక ఇంజినీర్ వెంకటరమణ వెల్లడించారు.
'కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసిన అమరావతి ఐకాస నేతలు'