విశాఖ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్ర మంత్రి నితీన్ గడ్కరీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శంకుస్థాపన చేశారు. శుక్రవారం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో అరకు ఎంపీ గొడ్డేటి మాధవి పాల్గొన్నారు. పాడేరు నుంచి గుండిగుడా వరకు ఎన్ఎచ్ 516 పేరిట 49.37 కిలోమీటర్లకు గాను రూ.571.77 కోట్లు మంజూరయ్యాయి.
సాలూరు నుంచి గజపతినగరం వరకు ఎన్ఎచ్ 26 పేరిట 32.03 కిలోమీటర్లకు గాను రూ.221.40 కోట్లు, సాలూరు పట్నం వద్ద బైపాస్ రోడ్డు నిర్మాణానికి ఎన్ఎచ్ 26కు 5.92 కిలోమీటర్లకు రూ. 70.81 కోట్లు మంజూరు చేసినట్లు ఎంపీ మాధవి తెలిపారు. అలాగే మన్యం ప్రాంతాల్లో రూ.863.98 కోట్లతో రోడ్లు నిర్మాణానికి నిధులు కేటాయించారు.
ఇదీ చదవండి: దుర్గ గుడి పైవంతెన ప్రారంభం.... వర్చువల్గా పాల్గొన్న జగన్, గడ్కరీ