ద్విచక్రవాహనంపై కిరాణా సామన్లు అమ్ముకునే భీమునాయుడు అనే వ్యక్తి... తన వద్ద ఉన్న వస్తువులను అమ్మి తిరుగుప్రయాణం అయ్యాడు. మార్గమధ్యంలో తాను ప్రయాణిస్తున్న వాహనం బ్రేకులు విఫలమవడంతో ద్విచక్రవాహనం అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో భీమునాయుడు అక్కడికక్కడే మరణించగా.. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి.