విశాఖ జిల్లా అనకాపల్లి పాత బస్టాండ్ వద్ద పాత భవనం కూలి ఇద్దరు మృతి చెందారు. గౌరీ స్టీల్ ట్రేడర్స్ పేరుతో పాత భవనంలో దుకాణం నడుస్తుండగా ఉన్నట్టుండి స్లాబ్ పడిపోయింది. ఆ సమయంలో దుకాణంలో ఉన్న యజమాని నూకరాజు, పనిచేసే వ్యక్తి బోయిన రమణ అక్కడికక్కడే మృతిచెందారు. మృతదేహాలను అగ్నిమాపక సిబ్బంది వెలికితీశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు భవనం తడిసిముద్దై... స్లాబ్ కూలిపోయి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.
ఇవీ చదవండి