ఇండియన్ ఐడల్ ఫైనలిస్ట్ షణ్ముఖ ప్రియను విశాఖలో కళా ప్రియులు సత్కరించారు. ఈ సందర్భంగా తన గానామృతంతో మంత్రముగ్దుల్ని చేసింది. షణ్ముఖ ప్రియ పాటలు వింటూ చిన్నా, పెద్దా అంతా ఆనందించారు. మేయరు హరి వెంకటకుమారి, జీసీసీ ఛైర్మన్ స్వాతిరాణి, మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్ ఆమెకు 'విశ్వగాన ప్రియ' అవార్డును ప్రదానం చేశారు.
ఈ కార్యక్రమంలో వీరు మామ, అంబటి రామకృష్ణ, ప్రతాప్, సురేఖ తదితరులు పాల్గొన్నారు. తల్లిదండ్రుల సహకారం, విశాఖ వాసులు ఆదరాభిమానాల సహకారంతో జాతీయస్థాయిలో ప్రతిభ కనబరిచినట్లు ఆమె తెలిపారు.
ఇదీ చూడండి: బిగ్‌బాస్: నాగ్ గ్రాండ్ ఎంట్రీ.. కంటెస్టెంట్‌లు వీరే!