విశాఖ జిల్లా పరిధిలోని ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో గిరిజనులు ఆందోళన బాట పట్టారు. అక్రమ అరెస్టులు ఆపాలని, గిరిజనులపై దాడులు కట్టడి చేయాలని నినాదాలు చేశారు. పెదబయలు మండలం ననిబరిలో ఆందోళన చేసిన గిరిజనులు... తమ గ్రామానికి చెందిన అప్పారావు, మల్లేశ్వరరావును పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపించారు. వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆ ఇద్దరికీ ఏదైనా జరిగితే పోలీసులే పూర్తి బాధ్యత వహించాలన్నారు.
ఇదీ చదవండి:
'కొండపల్లి' తవ్వకాలపై నిగ్గుతేల్చిన కమిటీ...క్వారీ లీజుల రద్దు!