ETV Bharat / state

TRIBAL PROBLEMS: వానైనా..వరదైనా..అదే వారికి దిక్కు - Tribal Doli problems in Gummadiguda village

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా గిరిబిడ్డల కష్టాలు.. మరింత ఎక్కువయ్యాయి. తాజాగా ఓ ఆదివాసి అస్వస్థతకు గురవ్వగా.. ఆటోలో ఆసుపత్రికి తరలించేందుకు యత్నించారు. కానీ వరద ఉధృతి ఎక్కువై.. వాహనం నీటిలో చిక్కుకుంది. చివరికి డోలీలో 8 కిలో మీటర్ల మేర నడుచుకుంటూ ఆసుపత్రిని చేరారు.

Tribals problems
గిరిజనుల కష్టాలు
author img

By

Published : Sep 6, 2021, 7:15 PM IST

Updated : Sep 6, 2021, 8:02 PM IST

సాధారణ రోజుల్లో ఆ గిరిపుత్రులు.. అనారోగ్యంతో ఆసుపత్రికి చేరాలంటే.. ఎన్నో అవస్థలు ఎదుర్కొవాలి. ఇంక వర్షాకాలం వచ్చిందంటే.. పారుతున్న వాగులు, వంకలతో మరిన్ని ఇబ్బందులతో పోరాడాల్సి వస్తోంది. తాజాగా విజయనగరం జిల్లా పాచిపెంట మండలం గుమ్మడిగుడ గ్రామానికి చెందిన ఎర్రజన్ని సంతోశ్​ అస్వస్థతకు గురయ్యాడు. ఈ క్రమంలో రోగిని ఆటోలో ఆసుపత్రికి తరలిస్తుండగా.. దారిలో వరద ఉద్ధృతి కారణంగా నీటిలో చిక్కుకుంది. అప్రమత్తమైన ఆదివాసులు.. వాహనం దిగి రోగిని డోలి కట్టి 8 కిలో మీటర్ల మేర నడుచుకుంటూ మైదాన ప్రాంతానికి తీవ్ర ఇబ్బందులు పడుతూ తీసుకువచ్చారు.

ఇదీ చదవండీ.. సౌకర్యాల పేరుతో మోసం.. వడ్డీతో సహా కట్టాలని ఆదేశం

Last Updated : Sep 6, 2021, 8:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.