విశాఖలోని ఓ ప్రైవేటు హోటల్లో ఏర్పాటు చేసిన జాతీయ గిరిజన ఉత్సవ్ ఆదివాసీ మహోత్సవ్ - 2019 కార్యక్రమాన్ని కేంద్ర గిరిజన సంక్షేమశాఖ సహాయమంత్రి రేణుకాసింగ్ ప్రారంభించారు. ఆన్లైన్ ద్వారా గిరిజన ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పించటం ద్వారా మెరుగైన ఫలితాలు ఆశిస్తున్నామని వెల్లడించారు. ఆన్లైన్ ద్వారా గిరిజన ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పించడం ద్వారా మెరుగైన ఫలితాలు ఆశిస్తున్నట్లు వెల్లడించారు. ట్రైఫెడ్ ద్వారా ఉత్పత్తి చేసిన వస్తువులను 190కి పైగా దేశాలకు విక్రయిస్తున్నట్టు వివరించారు. ఈ నెల 23 వరకు జరగనున్న గిరిజన ఉత్పత్తుల ప్రదర్శనలో వస్తువులు ఆకట్టుకుంటున్నాయి.
ఇది కూడా చదవండి.