విశాఖ జిల్లా చీడికాడ మండలం జి.కొత్తపల్లి గ్రామానికి చెందిన యువకుడు సిరికి జానకీరామ్ (24) చెట్లు నరకడానికి కూలి పనికి వెళ్లాడు. కోనాం-రాయిపాలెం సరిహద్దు ప్రాంతంలో చెట్లు నరుకుతుండగా.. కొమ్మ విరిగి జానకీరామ్పై పడింది. ఆసుపత్రికి తరలిస్తుండగా యువకుడు జానకీరామ్ మృతి చెందాడు. దీనిపై కేసు నమోదు చేసి, పోస్టుమార్టానికి తరలించినట్లు చీడికాడ ఎస్ఐ సురేష్ కుమార్ చెప్పారు.
ఇదీ చదవండి