ETV Bharat / state

విశాఖలో ఏపీఎస్​డీసీ కు రూ.1600 కోట్ల ఆస్తులు బదలాయింపు

విశాఖలో రూ.1600 కోట్ల విలువైన 15 ఆస్తులను ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అభివృద్ధి కార్పొరేషన్‌ (ఏపీఎస్‌డీసీ)కు బదలాయిస్తూ జిల్లా యంత్రాంగం నిర్ణయం తీసుకుంది. బదలాయించిన ఆస్తుల్లో ప్రస్తుతం వివిధ శాఖలకు చెందిన ప్రభుత్వ కార్యాలయాలు, ఖాళీ స్థలాలు, 200 ఎకరాల వరకు భూములున్నాయని సమాచారం. ఏపీఎస్‌డీసీకి బదలాయించే ఆస్తులను పూచీకత్తుగా చూపి రుణాలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.

Transfer of assets of Rs. 1600 crore to APS DC in Visakhapatnam
విశాఖలో ఏపీఎస్​డీసీ కు రూ.1600 కోట్ల ఆస్తులు బదలాయింపు
author img

By

Published : Jun 19, 2021, 7:16 AM IST

విశాఖలో రూ.1600 కోట్ల విలువైన 15 ఆస్తులను ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అభివృద్ధి కార్పొరేషన్‌ (ఏపీఎస్‌డీసీ)కు బదలాయిస్తూ జిల్లా యంత్రాంగం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆయా ఆస్తుల వివరాల ప్రతిపాదనలను సీసీఎల్‌ఏకు జిల్లా ఉన్నతాధికారులు నివేదించారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. 15 ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్‌లో రూ.2వేల కోట్లకుపైగా ఉండవచ్చని అంచనా వేశారు. బదలాయించిన ఆస్తుల్లో ప్రస్తుతం వివిధ శాఖలకు చెందిన ప్రభుత్వ కార్యాలయాలు, ఖాళీ స్థలాలు, 200 ఎకరాల వరకు భూములున్నట్టు సమాచారం.

మహారాణిపేట, సీతమ్మధార, గోపాలపట్నం, విశాఖ గ్రామీణ తహసీల్దార్‌ కార్యాలయాల పరిధిలో ఈ ఆస్తులున్నాయి. రూ.1600 కోట్ల రుణం కోసం విశాఖలోని 20 ఆస్తులను ఏపీఎస్‌డీసీకి బదలాయించాలని వారం కిందట ప్రభుత్వంనుంచి ఉత్తర్వులు వచ్చాయి. ఇందుకనుగుణంగా ఆయా ఆస్తుల వివరాలను ప్రభుత్వం ఇక్కడి రెవెన్యూ అధికారులకు పంపింది. ఏపీఎస్‌డీసీకి బదలాయించే ఆస్తులను పూచీకత్తుగా చూపి రుణాలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

* తొలుత పంపిన వివరాల్లో కలెక్టరేట్‌ భవన సముదాయం, గవర్నర్‌ బంగ్లా, దేవాదాయశాఖ ఆధీనంలోని టర్నర్‌చౌల్ట్రీ, ఏపీ బిల్డ్‌ కింద అమ్మకానికి పెట్టిన జిల్లా శిక్షణ కేంద్రం(డీటీసీ) భవన సముదాయం, పశుసంవర్థక శాఖ ఉద్యోగుల సహకార సొసైటీకి కేటాయించిన స్థలాలను ఏపీఎస్‌డీసీ బదలాయించాలని సూచించారు.

* ప్రాచీన కట్టడాలైన కలెక్టరేట్‌, గవర్నర్‌ బంగ్లా, టర్నర్‌చౌల్ట్రీ స్థలాల బదలాయింపుపై విమర్శలు రావడంతో జిల్లా యంత్రాంగం వాటిని మినహాయించింది. సొసైటీ స్థలం ప్రభుత్వ ఆస్తి కానందున దాన్ని పక్కన పెట్టారు. ఏపీ బిల్డ్‌ కోసం ఎంపిక చేసిన డీటీసీ స్థలంపై హైకోర్టులో కేసు నడుస్తోంది. దీంతో ఈ ఐదింటిని మినహాయించి ప్రతిపాదనలను సిద్ధం చేసినట్లు సమాచారం.

బదలాయింపునకు ప్రతిపాదించిన ఆస్తులివీ..

బక్కన్నపాలెంలోని సెరికల్చరల్‌, దివ్యాంగుల శాఖల భూములు, డైరీఫారం వద్ద ఉన్న పశుసంవర్థక శాఖకు చెందిన భూములు, ఎండాడ సర్వేనంబరు1లో ఎకార్డు వర్సిటీకి గతంలో కేటాయించిన భూములు, అక్కడే కార్మిక శాఖకు ఇచ్చిన భూములు, పాలిటెక్నిక్‌ కళాశాల భూములు, సీతమ్మధారలోని ఆర్‌అండ్‌బీ క్వార్టర్ల స్థలాలు, సీతమ్మధారలోని తహసీల్దార్‌ కార్యాలయ భూమి, భవనాలు, మహారాణిపేట ప్రాంతంలోని జిల్లా గ్రంథాలయ సంస్థకు చెందిన రెండు స్థలాలు తదితరాలను బదలాయిస్తూ ప్రతిపాదించారు. ఆస్తుల పొజీషన్‌ ప్రభుత్వ శాఖల పరిధిలోనే ఉంటుందని పంపిన ప్రతిపాదనల్లో యంత్రాంగం పేర్కొన్నట్లు సమాచారం.

ఇదీ చదవండి:

దిగ్గజ అథ్లెట్ మిల్కా సింగ్ కన్నుమూత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.