జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన అనకాపల్లి బెల్లం మార్కెట్లో లావాదేవీలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. వీటిని ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ ప్రారంభించారు. లాక్డౌన్లో భాగంగా గత నెల 20 నుంచి మార్కెట్లో బెల్లం క్రయావిక్రయాలు నిలిచిపోయాయి. దీనివల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా...వ్యాపారులు, కళాసీలతో అతను సమావేశం నిర్వహించి మార్కెట్ తెరిపించేలా చర్యలు తీసుకున్నారు.
ఇదీ చూడండి:నర్సీపట్నంలో పారిశుద్ధ్య సిబ్బందికి కూరగాయల పంపిణీ