ETV Bharat / state

ట్రాక్టర్​ను ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు... ఒకరికి తీవ్ర గాయాలు - విశాఖలో యాక్సిండెంట్ న్యూస్

ఆర్టీసీ బస్సు ట్రాక్టర్​ను ఢీకొన్న ప్రమాదంలో... ట్రాక్టర్ డ్రైవర్​కు తీవ్ర గాయాలయ్యాయి. ఇదే ట్రాక్టర్​పై ప్రయాణిస్తున్న మరో వ్యక్తికి స్వల్ప గాయాలు కావడంతో ఇద్దర్నీ నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ట్రాక్టర్​ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు... ట్రాక్టర్​ డైవర్​కి తీవ్రగాయాలు

author img

By

Published : Feb 10, 2021, 7:17 PM IST

విశాఖ జిల్లా రోలుగుంట సమీపంలో ఆర్టీసీ బస్సు ట్రాక్టర్​ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్​తో పాటుగా మరో వ్యక్తికి గాయాలయ్యాయి. నర్సీపట్నం డిపో నుంచి చోడవరం వెళుతున్న ఆర్టీసీ బస్సు.... రోలుగుంట సమీపంలోని పెట్రోల్ బంకు వద్ద ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి ట్రాక్టర్​ను ఢీ కొట్టింది.

డ్రైవర్​ పాము నానాజీ ... ట్రాక్టర్ సీటు నుంచి ఎగిరి కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. అదే వాహనం​లో ప్రయాణిస్తున్న మరో వ్యక్తి స్వల్పంగా గాయాలయ్యాయి. ఇద్దరినీ నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి:

ఇంటికో గుర్రం.. అదే గుర్రాల గ్రామం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.