ఆంధ్ర-ఒడిశా సరిహద్దుల్లోని మల్కన్‌గిరి జిల్లాలోని తులసి ఫారెస్ట్ రేంజ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు మరణించడం ఒడిశా పోలీసులకు గొప్ప విజయమని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అభయ్ అన్నారు. నేడు మల్కన్ గిరి జిల్లా కేంద్రానికి వచ్చిన డీజీపీ.. మరణించిన ముగ్గురు మావోయిస్టుల తలపై రూ. 10 లక్షల నగదు రివార్డు ఉందని తెలిపారు. ఏరియా కమిటీ సెక్రటరీ (ACS) ముక్కా సోది అలియాస్ అనిల్ అలియాస్ కిషోర్ పై రూ. 5 లక్షలు, చిన్నరావు తలపై వరుసగా రూ. లక్ష నగదు బహుమతి కలిగి ఉండగా, మహిళా క్యాడర్ సోని, ఏరియా కమిటీ సభ్యురాలు (ACM) తలపై రూ .4 లక్షల నగదు బహుమతి ఉందని డీజీపీ చెప్పారు. కేంద్ర బలగాల పర్యవేక్షణలో మల్కన్‌గిరి జిల్లా, ఇతర ప్రాంతాల్లో అనేక సంక్షేమ ప్రాజెక్టులు అమలవుతున్నట్లు పేర్కొన్నారు. మావోలు హింసను విడనాడి, జిల్లా సమగ్రాభివృద్ధి కోసం జన జీవనస్రవంతిలో కలవాలని పిలుపునిచ్చారు.
పెద్ద ఎత్తున ఆయుధ సామాగ్రి స్వాధీనం..
మావోయిస్టు శిబిరం నుంచి డీవీఎఫ్, ఎస్‌ఓజీ సిబ్బంది ఒక ఎస్‌ఎల్‌ఆర్ రైఫిల్, ఒక ఇన్సాస్ రైఫిల్, ఆరు మ్యాగజైన్‌లు, 59 లైవ్ బుల్లెట్లు, ఐఈడీ పేలుడు పదార్థాలు, వాకీటాకీలు, లైవ్ డిటోనేటర్లు, కిట్‌బ్యాగులు స్వాధీనం చేసుకున్నట్లు డీజీపీ అభయ్ తెలిపారు. యూనిఫాంలు, మందులు, మావోయిస్టు సాహిత్యానికి సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ముగ్గురు మావోయిస్టుల మృతదేహాలకు పోస్టుమార్టం జరుగుతోందని.. మృతదేహాలను తీసుకోవడానికి కుటుంబ సభ్యులు రాకపోతే పోలీసులే దహన కార్యక్రమాలను పూర్తి చేస్తారని డీజీపీ స్పష్టం చేశారు.
ఇదీ చదవండి:
Strike with Oil Tankers : నిలిచిపోయిన 1200 పెట్రోల్ ట్యాంకర్లు.. అంతా వాళ్లే చేస్తున్నారట!