ETV Bharat / state

train tickets: రైళ్లేమో ప్యాసింజర్​వి.. ఛార్జీలేమో ఎక్స్‌ప్రెస్​వి

ప్యాసింజర్‌ రైళ్ల టిక్కెట్టు ధరల్ని అమాంతం పెంచేశారు. పేదవారిపై భారం మోపిఆదాయం పెంచుకోవాలని విశాఖ వాల్తేరు రైల్వే చూస్తోంది. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన 4 ప్యాసింజర్‌ రైళ్లనూ ఎక్స్‌ప్రెస్‌లుగా మార్చి.. కేవలం కౌంటర్లలో మాత్రమే టిక్కెట్లనిస్తోంది.

ticket prices  rises for passenger trains
టికెట్ ధరలు
author img

By

Published : Aug 2, 2021, 11:39 AM IST

Updated : Aug 2, 2021, 11:48 AM IST

ఉద్దేశం ఒకటి, అమలు మరొకటి. ప్రయాణికుల్ని నియంత్రించాలనే ఉద్దేశంతో ప్యాసింజర్‌ రైళ్లలోనూ సీట్లను రిజర్వేషన్‌ చేస్తున్నామని విశాఖ జిల్లా వాల్తేరు రైల్వే అధికారులు తెలిపారు. కానీ టిక్కెట్లను మాత్రం కౌంటర్లకే పరిమితం చేసి, రిజర్వేషన్‌ ఛార్జీలతో పాటు అదనంగా మరింత మొత్తాన్ని కలిపి వసూలు చేస్తున్నారు. ఈ రైళ్లకు ఆన్‌లైన్‌లో ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. పేదలకోసం నడుపుతున్నవి కాబట్టి కౌంటర్లకే పరిమితం చేశామని వాల్తేరు అధికారులు చెబుతున్నారు. అలాంటప్పుడు రిజర్వేషన్‌ ఛార్జీలు, అదనపు భారం ఎందుకని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. ఇలా కొన్ని ప్రాంతాలకు రెండింతలు, మరికొన్ని చోట్లకి మూడింతలుగా సాధారణ టిక్కెట్‌ ధరల్ని పెంచేశారు.

ఎక్స్‌ప్రెస్‌ మాయ..

ప్రస్తుతం విశాఖ నుంచి కాకినాడ, రాయపూర్‌, గుణుపురం, కిరండూల్‌ ప్యాసింజర్‌ రైళ్లు తిరుగుతున్నాయి. వీటిలో కొన్ని విషయాల్ని గమనిస్తే..

  • విశాఖ-కిరండూల్‌ రైలును జగదల్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌ స్పెషల్‌ రైలుగా మార్చారు. సమయాల్ని మాత్రం అవే ఉంచారు. అరకు టిక్కెట్టులో 60శాతం అదనంగా సాధారణ కోచ్‌కు తీసుకుంటున్నారు. ఇదే రైలులో ఉన్న విస్టాడోమ్‌ కోచ్‌కు మాత్రం కేవలం రూ.5 మాత్రమే పెంచారు.
  • విశాఖ-కాకినాడ ప్యాసింజర్‌లో అనకాపల్లి టిక్కెట్టును విశాఖ నుంచి మూడింతలుగా చేశారు. అంతకుముందు రూ.10ఉండగా, ఇప్పుడు దాన్ని రూ.30చేశారు. ఆ చుట్టుపక్కల మండలాల వారు చాలామంది విశాఖలో పలు పనుల నిమిత్తం ఈ రైలును ఆశ్రయిస్తుంటారు.
  • ఉత్తరాంధ్ర జిల్లాలకు కీలకంగా ఉన్న విశాఖ-గుణుపురం రైలులోనూ ఇదే పరిస్థితి ఉంది. గతంలో విశాఖ-విజయనగరం, శ్రీకాకుళం మధ్య రావటానికి, తిరిగి వెళ్లడానికి ఎంత టిక్కెట్టయితే పెట్టేవారో.. ఇప్పుడు కేవలం ఒక వైపునకే ఆ ధరను చెల్లించాల్సి వస్తోంది.
  • ఒక్క జగదల్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌ స్పెషల్‌కు తప్ప.. కాకినాడ, రాయపూర్‌, గుణుపురం రైళ్లకు ఆన్‌లైన్‌ రిజర్వేషన్‌ అవకాశాన్ని తీసేశారు. కానీ రిజర్వేషన్‌ ఛార్జీల్ని మాత్రం వసూలు చేస్తున్నారు.
  • మరికొన్నాళ్లలో విశాఖ-పలాస ప్యాసింజర్‌ రైలునూ ప్రారంభిస్తామని చెబుతున్న అధికారులు.. ఈ మధ్యే ఆన్‌లైన్‌లో బుకింగ్‌లు కూడా తెరిచారు. టికెట్లు అమ్ముడుపోయిన తర్వాత రైలును రద్దు చేశారు. ఈ రైలుకు కూడా ధరల్ని పెంచినట్లు ఆన్‌లైన్‌లో చూపించారు.
  • సామాన్యులపై భారం తగ్గించేలా వాల్తేరు రైల్వే అధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు రైల్వే నిపుణులు, రైల్వే ప్రయాణికుల సంఘాల నేతలు విన్నవించుకుంటున్నారు. అయితే ఇప్పుడున్న కొవిడ్‌ పరిస్థితుల్లో టిక్కెట్‌ ధరలు ఇలాగే ఉంటాయని అధికారులు తేల్చిచెబుతున్నారు.

ఇదీ చూడండి.
ఏపీఎస్‌డీసీ నిబంధనలు కొన్ని రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయి: కేంద్రం

Last Updated : Aug 2, 2021, 11:48 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.