విశాఖ జిల్లా హుకుంపేట మండలం తీగలవలస జలపాతం సమీపంలో ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. గుడ్డిగుమ్మి జలపాతం వద్ద ఫోటో షూట్ చేద్దామని పది మంది యువకులు వెళ్లగా.. వారిలో ఒకరు ప్రమాదవశాత్తు జారి జలపాతంలో పడిపోయారు. అతన్ని రక్షించటానికి వెళ్లిన మరో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, రెవెన్యూ సిబ్బంది.. వారికోసం గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన ముగ్గురు సన్యాసిపాలెంకు చెందిన నిరంజన్(19), నాగేంద్ర పడాల్(22), వినోద్ కుమార్ (25)లుగా గుర్తించారు.
ఇదీ చదవండి