విశాఖ ఏజెన్సీ ప్రాంతాల్లో గుర్తుతెలియని వ్యక్తుల దొంగతనాలతో గిరిజనులు ఆందోళనకు గురవుతున్నారు. ఖరీదైన ద్విచక్ర వాహనాలతో పాటు ఇళ్లల్లోకి చొరబడి నగదు, బంగారాన్ని దొంగలిస్తున్నారు. చింతపల్లి , గూడెం కొత్తవీధి , సీలేరు రహదారుల్లో.. వాహనాల్లో ప్రయాణించే వారిపై దాడిచేసి చరవాణీలు, బంగారాన్ని అపహరిస్తున్నారు. నడింపాలెం , రామరాజుపాలెం , కొండగోకిరి , రాజేంద్రపాలెంలో విలువైన వస్తువులను దొంగిలిస్తుండటంతో.. బాధితులు లబోదిబోమంటున్నారు. స్థానికుల పోలీసులకు ఫిర్యాదు చేయటంతో.. వారు గ్రామానికి వస్తున్న కొత్త వ్యక్తులు, అనుమానితులను గుర్తించే పనిలో పడ్డారు. గ్రామాల్లో 5 ద్విచక్ర వాహనాలతో పాటు బంగారం, నగదు, 10 చరవాణీలు దొంగిలించినట్లు గ్రామస్థులు పోలీసులకు తెలిపారు.
ఇదీ చదవండి: పరదా పట్టల కోసం ఇద్దరు మిత్రుల మధ్య ఘర్షణ.. కత్తితో దాడి