చోరీకి పాల్పడ్డాడని అనుమానంతో ఓ వ్యక్తిని కొప్పాక గ్రామస్థులు అనకాపల్లి గ్రామీణ పోలీసు స్టేషన్కు అప్పజెప్పారు. బీహార్ నుంచి కొంతమంది చోరీకి పాల్పడే వారు వచ్చారన్న అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఒక వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించి.. తనను కత్తి చూపి బెదిరించాడని మహిళ ఆరోపించింది.
గ్రామస్తులు అతన్ని పోలీసులకు అప్పగించారు. ఆ వ్యక్తిని ప్రశ్నించిన పోలీసులు.. మతి స్థిమితం సరిగా లేనివాడని అనుమానిస్తున్నారు. చోరీల ముఠాలు ఏవీ ఆ ప్రాంతంలో తిరగడం లేదని భరోసా ఇచ్చారు. గ్రామస్తులు అప్పగించిన వ్యక్తికి సంబంధించిన వివరాలు సేకరిస్తున్నామని చెప్పారు.
ఇవీ చూడండి: