ప్రభుత్వం ఏర్పాటు చేసిన మూడు నెలల్లో నాలుగు లక్షల మందికి ఉద్యోగాలుచ్చిన ఘనత ఒక్క సీఎం జగన్ కే దక్కిందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తం శెట్టి శ్రీనివాసరావు అన్నారు.దేశలో ఉన్న ముఖ్యమంత్రుల్లో వైయస్ జగన్మోహన్ రెడ్డి అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారని తెలిపారు. మద్యం దుకాణాల సూపర్ వైజర్లు,సేల్స్ మెన్ లకు ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.మద్యం దుకాణాల ఉద్యోగాలకు,వాలంటీర్ల ఉద్యోగాలకు,గ్రామ సచివాలయం ఉద్యోగాల్లో ఎలాంటి అవకతవకలకు పాల్పడకుండా అత్యంత పారదర్శకంగా అభ్యర్థులను ఎంపిక చేసినట్లు మంత్రి తెలిపారు. మద్యం దుకాణాలకు ఎంపికైన సూపర్ వైజర్లు,సేల్స్ మెన్ లకు ఈ సందర్భంగా నియామక పత్రాలు అందజేశారు.ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులంతా నిజాయితీగా క్రమశిక్షణతో పనిచేసే ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని మంత్రి ఆకాంక్షించారు.
ఇదీచూడండి.'కొత్తగా ప్రయత్నించండి..లేకపోతే కామెడీ పీస్ అవుతారు'