
విశాఖ మన్యంలో కొండ వాగు దాటుతూ ఓ వ్యక్తి కొట్టుకుపోయి మృతి చెందాడు.పెదబయలు మండలం కూతంగిపుట్టులో శనివారం సాయంత్రం మత్యగడ్డ దాటుతూ గల్లెల చిన్నయ్య (58) కొట్టుకుపోయాడు. వరద ఉద్ధృతి కారణంగా బంధువులు గాలింపు చర్యలు చేపట్టలేకపోయారు. సమీపంలో ఉన్న గిరిజనులు చేపలు పడుతుండగా మృతదేహం వలలో చిక్కింది. ఘటనను కుటుంబీకులు పోలీసులకు సమాచారం అందించారు.
ఇవీ చదవండి