విశాఖపట్నం జిల్లా మాడుగుల నియోజకవర్గంలో మాడుగుల, చీడికాడ, దేవరాపల్లి, కె.కోటపాడు మండలాల్లోని రెండు రోజులుగా పొగమంచు దట్టంగా కమ్ముకుంటుంది. మన్యం ప్రాంతాన్ని తలపించేలా మైదాన ప్రాంతమైన మాడుగుల నియోజకవర్గంలో పొగమంచు ఎక్కువగా వ్యాపించింది. వాహనదారులు లైట్లు వేసుకొని రాకపోకలు సాగిస్తున్నారు. పొలాలు, రోడ్లు పొగమంచుతో నిండిపోయాయి.
ఇదీ చదవండి: ఈటీవీ ఆంధ్రప్రదేశ్, ఈటీవీ భారత్ కథనాలకు స్పందన