విశాఖ జిల్లా ఎలమంచిలి పట్టణంలోని భూలోకమాంబ, సుబ్రహ్మణ్యస్వామిల పంచరాత్రి మహోత్సవాలు ఈ రోజు లాంఛనంగా ఆరంభమయ్యాయి. ఇందులో భాగంగా సుబ్రహ్మణ్య స్వామికి ప్రత్యేక అభిషేకాలు చేశారు. ఉత్సవ కమిటీ కన్వీనర్, విశాఖ డెయిరీ సీఈవో ఆడారి ఆనంద్ కుమార్ ఈ వేడుకలను ప్రారంభించారు. ఐదు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగే ఈ ఉత్సవాల్లో విద్యుత్ అలంకరణ ప్రత్యేకంగా నిలుస్తోంది. జిల్లా నలుమూలల నుంచి భక్తులు ఈ జాతరకు తరలివచ్చి ప్రత్యేక పూజలు చేస్తున్నారు.
ఇదీ చదవండీ...తిరుచానూరుకి చేరిన శ్రీవారి లక్ష్మీకాసుల హారం...